రాను రాను సమాజంలో ఆడపిల్లలకు సెఫిటీ లేకుండా పోతుంది. అది సెలబ్రిటీలు కావచ్చు..సామాన్యులు కావచ్చు..చిన్న పిల్లల నుండి మడు ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని చూసిన కొందరు మృగాలు వదలడం లేదు. ఫిజికల్ రేప్ చేసి చంపేవారు కొందరు అయితే. మానసికంగా అసభ్యకర మెసేజ్లు..చెత్త వీడియోలు పంపి వేధించే వారు కొందరు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఇలా మమ్మలని వేధించారని న్యాయం చేయమటూ పోలీసులను ఆశ్రయించిన న్యూస్ లు మనం చాలానే చూశాం. ఇక ఆ లిస్ట్ లోకి తాజా గా మరో హీరోయిన్ కూడా చేరింది.
నటి సంజన గల్రాని..ఈ పేరు అందరికి గుర్తుంది కదా.. అప్పుడెప్పుడి ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ కి చెలెల్లుగా నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తరువాత అరా కొరా సినిమాలు చెసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. కానీ డ్రగ్స్ కేసుల విషయంలో అరెస్ట్ అయ్యి మరింత పాపులారిటిని ఇట్టే మూ టకట్టుకుంది. దీంతో అమ్మడు గురించి అప్పట్లో వార్తలు బాగా హాట్ హాట్ గా వైరల్ అయాయి. ఇక ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఇది ఈ పనులతో అమ్మడు పేరు బయటకి వచ్చింది.
కన్నడకి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప సంజనతో ఒకప్పుడు కలిసి పని చేసాడట. ఇక అప్పటి ఆ చనువు ఫ్రెండ్ షి ప్ గా మారి మ్మచి స్నేహ బంధంగా మారిందట. కానీ, అతను నటి సంజన గల్రానికి అర్దరాత్రి సమయంలో కొన్ని చెప్పుకోలేని రాయలేని విధంగా ఉండే అశ్లీల మెసేజ్లు పంపాడని…దీంతో అవి చూసి భరించలేక.. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు విచారణ చేపటగ్గా..ఎంక్వైరీ లో అతను తానెలాంటి అశ్లీల మెసేజ్లు పంపలేదని..గట్టిగా వాదించాడట. అనుమానం వచ్చిన పోలీసులు అతని ఫోన్ను చెక్ చేయగా.. అందులో అలాంటి చాట్..ఫోటోలు వీడియోలు ఏం లేవ్ట, దీంతో షాఇన పోలీసులు.. ఆ ఫోన్ని ఫొర్సెనిక్ ప్రయోగశాలకు పంపారు. అయితే ఆడంపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. మరి చూడాలి తప్పు ఎవరిదో..పోలీసులు ఎలాంటి సిక్ష వేస్తారో..?