పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత చేసిన సినిమా రాధేశ్యామ్. జాతకాలు + ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చి వారం రోజులు పూర్తి చేసుకుంది. వారం రోజుల వసూళ్లు చూశాఖ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అయిపోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంత దారుణంగా ఉన్నాయి వసూళ్లు. ఏపీ, తెలంగాణలోనే ఈ సినిమాకు రు. 50 కోట్ల నష్టాలు తప్పేలా లేవు. అసలు తమిళం, కన్నడం, మళయాళ జనాలు ఈ సినిమాను పట్టించుకోలేదు.
సాహో నార్త్ బెల్ట్ హిందీలో రు. 150 కోట్ల వసూళ్లు వస్తే… అది కూడా తొలిరోజు డిజాస్టర్ టాక్‌తో.. రాధేశ్యామ్ ఫుల్ రన్‌లో రు. 25 కోట్ల దగ్గర ఆగిపోయేలా ఉంది. దీనిని బట్టే ఈ సినిమా ఎంత దారుణ ఫలితం నమోదు చేసిందో క్లీయర్‌గా తెలుస్తోంది. కేవలం జిల్ లాంటి ఒకే ఒక సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను సరిగా డీల్ చేయకపోవడం.. పరిమితికి, కథకు అవసరం లేకున్నా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడమే ఇంత ప్లాప్‌కు కారణమైంది.
మరో నాలుగైదు రోజుల్లో త్రిబుల్ ఆర్ థియేటర్లలోకి దిగుతోంది. దీంతో రాధేశ్యామ్ ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిసిపోయినట్టే. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ టు సౌత్.. అటు ఓవర్సీస్‌లో కూడా రాధేశ్యామ్‌కు ఇచ్చిన థియేటర్లను త్రిబుల్ ఆర్ ఆక్రమించేస్తోంది. ఈ సినిమా టాక్‌పై హీరోయిన్ పూజా హెగ్డే తానా ఇంటర్వ్యూలో ఓపెన్ అవ్వడంతో పాటు ఈ సినిమా ప్లాప్ అని ఒప్పుకున్నట్టుగా బాంబు పేల్చింది.
మనం ప్రతి సినిమాకు ఎలాంటి ఫలితాన్ని అందుకోవాలో ఓ డెస్టినీ ఉంటుందని.. కొన్ని సినిమాలు కేవలం ఓకే అనుకున్నా.. అవి బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్పామ్ చేసి హిట్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా బాగున్నా.. అవి అలా చేయవు అని ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. పూజ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాధేశ్యామ్ ప్లాప్ సినిమా అని ఆమె ఒప్పుకున్నట్లే ఉందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతుండగానే… ఆమె సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడకుండా.. నెగిటివ్ అర్థం వచ్చే ధోరణిలో మాట్లాడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూజాపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో కూడా ప్రభాస్‌కు, పూజాకు మధ్య మాటలు లేవని.. అసలు పూజా వస్తే పలకరించేందుకు కూడా ప్రభాస్ ఇష్టపడలేదన్న ప్రచారం బయటకు వచ్చింది. ఇక ప్రమోషన్లలోనూ వీరు ఎడమొఖం.. పెడమొఖంగానే ఉన్నారు. ఇప్పుడు సినిమా ప్లాప్ అయితే అంతా మన డెస్టీనీ అంటోంది పూజ.. దీనిని బట్టే ఆమె సినిమాపై ముందు నుంచి విముఖంగానే ఉందని అర్థమవుతోంది.