టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టెంపర్ నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. కెరీర్లో ఎన్టీఆర్‌కు ఐదు వరుస హిట్లు ఎప్పుడూ పడలేదు. ఈ నెల 25న వచ్చే త్రిబుల్ ఆర్ సినిమా కూడా హిట్ అయితే టాలీవుడ్ హిస్టరీలోనే ఈ తరం జనరేషన్ హీరోలకు ఎవ్వరకు లేని విధంగా డబుల్ హ్యాట్రిక్ ఎన్టీఆర్ ఖాతాలో పడుతుంది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్‌లో భారీ, క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఇలా మంచి ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి.
కొరటాల శివ సినిమా స్టార్ట్ అయ్యి యేడాది అవుతోంది. అసలు ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో అర్థం కావడం లేదు. అటు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. తమ అభిమాన హీరోను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా ? అని వెయిట్ చేస్తూ ఎన్నో ఆశలతో ఉన్నారు. కనీసం ఈ యేడాది అయినా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా త్వరగా ఫినిష్ చేసి ఈ దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటాడని ఆశలతో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కరోనా టైంలో తన ఫ్యామిలీకి బాగా టైం కేటాయించాడు. తన భార్యతో పాటు ఇద్దరు కుమారులతో బాగా ఎంజాయ్ చేశాడు. ఎన్టీఆర్ ఇద్దరు కుమారులు భార్గవ్‌రామ్, అభయ్ రామ్. సినిమాల్లో ఎంత బిజీ షెడ్యూల్‌తో ఉన్నా కూడా ఎన్టీఆర్‌కు ఏ మాత్రం స్పేస్ ఉన్నా పిల్లలతో ఆడుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ, పిల్లల ఫొటోలు షేర్ చేసేందుకు పెద్దగా ఇష్టపడడు. చాలా అరుదుగా మాత్రమే ఎన్టీఆర్ పిల్లల ఫొటోలు బయటకు వస్తుంటాయి.
తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తన చిన్నకొడుకు భార్గవ్‌రామ్‌ను ఎత్తుకుని ఉంది. ఈ ఫొటోలో భార్గవ్‌రామ్ చాలా క్యూట్‌గా ఉన్నాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. భార్గవ్‌రామ్ లుక్స్ సూపర్ అంటూ తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.