యావత్ భారతదేశం అంతా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న సినిమా RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ చూసేందుకు అప్పుడు కౌంట్‌డౌన్ గంటల్లోకి వచ్చేసింది. గడియారంలో ముల్లు ఎంత స్పీడ్‌గా తిరుగుతుందా ? అని ప్రతి ఒక్కరు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే 24వ తేదీ రాత్రి నుంచే థియేటర్లలో సినిమా షోలు పడిపోనున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ సింహాగర్జన ఏ రేంజ్‌లో ఉంటుందా ? అని ప్రతి ఒక్కరు టెన్షన్ టెన్షన్‌తో ఉన్నారు. అసలు సినిమా ఎలా ఉంటుంది ? రాజమౌళి చరణ్‌ను పైకి లేపాడా ? లేదా ఎన్టీఆర్ క్యారెక్టర్ డామినేటింగ్‌గా ఉంటుందా ? బాహుబలి ది కంక్లూజన్ కలెక్షన్లు బీట్ చేస్తుందా ? ఇవే చర్చలు ఎక్కడ చూసినా నడుస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో రామ్‌చరణ్ – రాజమౌళి – ఎన్టీఆర్ ముగ్గురూ కూడా వారి గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఎన్నో రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపామని వీరు చెప్పారు. ప్రతి ఈవెంట్‌లోనూ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటకు రావడమే కాకుండా.. వీరి పర్సనల్ విషయాలు.. ఇప్పటి వరకు మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలే తెలుస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తారక్, చెర్రీతో చిట్‌చాట్ చేశాడు. అటు యాంకర్ సుమ మీమ్స్‌తో ఇద్దరు హీరోలు, దర్శకుడు రాజమౌళిని ఓ ఆటాడేసుకుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ముగ్గురితో చేసిన చిట్ చాట్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ట్రిపుల్ ఆర్‌కు చెందిన చాలా ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.
ఈ వీడియోలో రాజమౌళి చెప్పినదానిని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ ఆరెస్ట్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలవడంతో పాటు భీభత్సంగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పులి ఫైట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి.. ఎన్టీఆర్ అరెస్ట్ ఫైట్ గురించి ఇంట్రస్టింగ్ స్టోరీ చెప్పమని దర్శకుడు సందీప్ అడగడంతో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. గోండు జాతి వీరుడు కొమరం భీంను బ్రిటీష్ అధికారిగా ఉన్న రామ్‌చరణ్ అరెస్టు చేసే సన్నివేశంలో ఓ 1000 మంది దొమ్మి తరహాలో కొట్టుకుంటూ ఉంటారు. వారిని చెదరగొట్టడానికి రామ్‌చరణ్ లాఠీ పట్టుకుని గుంపును చెదరగొడుతూ ఉంటాడట.
ముందు ఈ సీన్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలోనే తీయాలని అనుకున్నారట. అయితే రాజమౌళి అనుకున్నంత ఫీల్ అవుట్ ఫుట్ లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యాడట. తర్వాత ఆ ఫైట్‌ను సాల్మన్ అనే ఫైట్ మాస్టర్‌కు అప్పగించారట. సాల్మన్ చేస్తాడా ? అన్న సందేహాలు ఉన్నాయట. నెల రోజుల తర్వాత టెస్ట్ షూట్ చేసి.. అప్పుడు సాల్మన్‌ను తీసుకువచ్చారట. సాల్మన్ పనితీరుకు రాజమౌళి బాగా ఇంప్రెస్ అయిపోయాడట.
ఈ అరెస్టు సీన్ ఒక్కటే 40 మంది ఫైటర్స్ – 200 మంది ట్రైన్డ్ జిమ్ బాయ్స్ – 500 మంది ట్రెయిన్డ్ జూనియర్ ఆర్టిస్టులు – ఆ తర్వాత అన్ ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు.. మొత్తం 2000 వేల మందితో ఈ ఫైట్‌ను షూట్ చేశారట. సినిమాలో ఈ ఫైట్ సీన్ ఎక్కువ సేపు ఉంటుందని.. మొత్తం ఈ ఫైట్ కోసమే రెండు నెలల పాటు కష్టపడ్డామని రాజమౌళి తెలిపాడు. ఓవరాల్‌గా చూస్తే 2 వేల మంది సమక్షంలో చరణ్.. ఎన్టీఆర్‌ను అరెస్టు చేయడం అంటే ఈ సీన్ సినిమాలో పెద్ద భీభత్సాన్నే క్రియేట్ చేస్తుందని.. సినిమాకే మేజర్ హైలెట్‌గా నిలుస్తుందని అర్థమవుతోంది.