Moviesఉమెన్స్‌ డే కాదు ఫూల్స్‌​ డే..హవ్వా..అంత మాట అనేసిందేంటి..?

ఉమెన్స్‌ డే కాదు ఫూల్స్‌​ డే..హవ్వా..అంత మాట అనేసిందేంటి..?

నిన్న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుకున్నారు ఆడవాళ్ళు. ఇక మగావాళ్ళు అయితే తమ ఇళ్లల్లోని ఆడవాళ్లకు విషేస్ చెప్పుతూ..గిఫ్ట్ లు ఇస్తూ వాళ్ళని సంతోషపరిచారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా వాళ్ళు ఉమెన్స్ డే ని ఎలా జరుపుకున్నారో ఫోటోల రూపంలో తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వార తెలిపారు. ఇలా అందరు తమకు తోచిన విధంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

అయితే, జబర్ధస్త్ యాంకర్ అనసూయ మాత్రం..కాంట్రవర్షీయల్ ట్వీట్ తో పెద్ద దుమారానికే తెర తీసింది. అనసూయ గురించి మనకు తెలిసిందే..ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడేస్తుంది. నెట్టింట తనను ట్రోల్ చేస్తే తాట తీసేస్తుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే అనసూయ..ఉమెన్స్‌ డే నాడు పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆమె ట్వీట్ లో ఏం రాసుందంటే..” ఓహో,,సడెన్ గా ట్రోలర్స్ కి.. మీమర్స్‌ కి.. ఈరోజు మహిళల పై గౌరవం పెరిగిన్నట్లుందే . మహిళల దినోత్సవం సంధర్భంగా ఆడవాళ్ల గురించి తెగ పొగిడేస్తున్నారు. ఉమెన్స్‌ డే అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించారు. అంతేలేండి.. ఈ గౌరవం మహిళలకి దక్కేది ఎలాగో 24 గంటలే..ఆ తరువాత ముగుస్తుంది. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్‌ డే’ అంటూ తనదైన స్టైల్ లో ఘాటు గా ట్వీట్‌ చేసింది.

ఇక అనసూయ ట్వీట్‌ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు. అను చెప్పింది ముమ్మాటికి నిజమే. కేవలం ఆడవాళ్లకి ఒక్క రోజు గౌరవం ఇవ్వడం కాదు..ప్రతిరోజు ఆడవాళ్లని మనుషులుగా చూడండి అంటూ అనసూయ కి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో నువ్వు ఎప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటావా తల్లి.. అంటూ నెగిటీవ్ కామెంట్స్‌ చేస్తున్నారు. మరీ మీ దృష్టిలో అనసూయ చెప్పింది కరెక్ట్ నేనా .. లేక అలా ట్వీట్ చేసి తప్పు చేసిందా..?

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news