సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత ఎంత బాగుపడ్డారో తెలియదు కానీ..తప్పు దారిలో మాత్రం బాగా నడుస్తున్నారు అంటున్నారు జనాభ. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకనే హీరోయిన్స్ పై అసభ్యకర కామెంట్లు..హాట్ ఫోటోల పై పిచ్చి పిచ్చి వేషాలు..ముఖ్యంగా ట్రోలింగ్ చేయడం..ఎవ్వరిని వదలకుండా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.
రీసెంట్ గా అలాంటి సమస్యనే ఎదురుకుంటున్నాడు మెగా ప్రీన్స్ హీరో వరుణ్ తేజ్. అబ్బాయి చాలా సాఫ్ట్. తన పని తాను చూసుకునిపోయే రకం. వివాదాల్లో అసలు తల్ దూర్చడు. నాన్న ని రాజకీయ పరంగా ఎంతమంది ఎన్ని మాటలు అంటూన్న అస్సలు పట్టించుకోడు..అని నెటిజన్స్ అభిప్రాయం. ఈ హీరో తాగా గా నతించిన చిత్రం “గని”. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.
అయితే ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లుగా కష్టపడ్డాం. ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అభిమానులకి మంచి సినిమా ఇచ్చాననే సంతృప్తి నాకుంటుంది. నిజనానికి నేను సినిమాల్లోకి వచ్చాకనే బ్రతకడం నేర్చుకున్నా.. ఒక్కవేళ సినిమాలోకి రాకపోయుంటే.. పోరంబోకులా ఎక్కడో తిరిగే వాడిని..సినిమాలోకి వచ్చాను కాబట్టే ఇప్పుడు నేను డిసిప్లయిన్ గా ఉన్నా”..అంటూ చెప్పుకొచ్చాడు అంతే..ట్రోలర్స్ కి మంచి పాయింట్ దొరికి వరుణ్ ని నెట్టింట ఆడేసుకుంటున్నారు. మెగా హీరోని పోరంబోకులా అవ్వకుండాకాపాడింది సినిమా ఇండస్ట్రీ అంటూ పరోక్షంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కగా ఈ మూవీ ఏప్రిల్ 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ అయిన గని ట్రైలర్ కొద్ది క్షణాల్లోనే వన్ మిలియన్స్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం.