మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన రెండేళ్ల క్రితం కట్టుకున్న తమ సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అత్యంత విలాసవంతమైన భవంతిలో చరణ్ – ఉపాసన దంపతులు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక అపోలో హాస్పటల్స్ బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్ చెపుతూ ఉంటారు.
ఇక ఉపాసన ఎంత బిజీ పర్సన్ అయినా కూడా ఆమె సామాజిక సేవలో యాక్టివ్‌గా ఉంటారు. ఉపాసన తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉండడంతో ఆమె మానసిక, వ్యక్తిగత ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలు చెపుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఉపాసన నోట మంత్రం పఠించాలన్న మాట రావడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తాజాగా ఉపాసన ఔషదాల గురించి మాట్లాడే పాత వీడియోతో పాటు దానికి పురాణాలు, ప్రాచీన సాహిత్యంతో లింకప్ చేస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ మందులు తీసుకునే ముందు మీరు మహా మృత్యుంజయ మంత్రాన్ని రెండుసార్లు జపిస్తే అది మీకు బాగా పనిచేస్తుందని పురాణాలు చెపుతున్నాయి.. దాని గురించే తాను ఇటీవల చదివాను అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే ఉపాసన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. భారతదేశంలోనే అతి ఉన్నతమైన అపోలో చైన్‌లో ఎగ్జిగ్యూటివ్‌గా ఉన్న ఉపాసన ఇలా మూఢనమ్మకాలను నమ్మడం, ప్రచారం చేయడం తప్పుకదా ? ఈ వ్యాఖ్యలు అన్నందుకు ఆమె సిగ్గుపడాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఉపాసన ఓ వ్యాధి ఉన్న వ్యక్తి త్వరగా కోలుకునేందుకు స్వీయ విశ్వాసం గురించి చెపుతున్నారు.. ఇది తప్పుకాకపోయినా మందు తీసుకునే ముందు మంత్రం పఠించాలని ఆమె ఎవ్వరిని అడగలేదని కొందరు ఆమె వాదన వినిపిస్తున్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆమెను కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆమె తన విశ్వాసాన్ని చెప్పిందని అంతమాత్రానా ఆమెను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు.