బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండ్రస్టీలో తన అందం, అభినయంతో పాటూ ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి మరి నటించి చాలా తక్కువ సమయంలోఅగ్ర తారగా ఓ వెలుగు వెలిగింది దీపికా పదుకునే.. బాలీవుడ్ లో హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ హైయెస్ట్ పైడ్ యాక్ట్రెస్ గా నిరంతరం వార్తల్లో నిలుస్తుంటుంది.
ఈ బ్యూటీ తాజాగా నటించిన ‘గెహరాయియా’ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. దీపికా మాత్రం జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించిన దీపికా.. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తాజాగా వివరించారు. తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని బయటపెట్టింది దీపికా.
అయితే ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపికా హాట్ గా ఎంతో అందంగా కనిపించింది. ఇంత వరకు బాగానే ఉన్నా కానీ క్యాప్షన్ మాత్రం సానుభూతి కావాలని కోరుకుంటున్నట్లు ఉండేడంతో నెటిజన్స్ అమ్మడిపై విరుచుకుపడ్డారు. దీని పై నెటిజన్స్ మాత్రం భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. నీలాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కష్టాలు అనుభవించి ఈ స్దాయికి వచ్చాను అనడం ఫన్నీ గా ఉంది అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతుంది.. అయినా కూడా ఇంకా సింపతీ కోసం ఎందుకు ఆ ఏడుపు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఓ స్టార్ హీరోయిన్ .. అంతేనా ఒక స్టార్ హీరోకు భార్యవు..కోట్లకు కోట్లు సంపాదిస్తున్నావు.. అయినా నువ్వు ఇంకా ప్రజల నుంచి సానుభూతి కోరుకుంటున్నావా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram