టాలీవుడ్‌లో రెండు ఫ్యానెల్స్ లేదా రెండు కేంద్రాలుగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ మధ్య సినిమాల విషయంలో ఇలాంటి పోరే జరిగేది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య అభిమానుల మధ్య కూడా పెద్ద యుద్ధాలే జరిగేవి. ఇక్కడ ఉన్నదంతా మా హీరోయే గొప్ప.. మా హీరో సినిమాయే సూపర్ హిట్ అన్న గొడవ తప్పా.. అంతకు మించి ఏం ఉండదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా యుగం కావడంతో తమకు నచ్చని హీరో సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతున్నారు.
ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు మంచు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఎంతో గొప్ప స్నేహితులు. నాలుగు దశాబ్దాలుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. గతంలో చిరంజీవి హీరోగా ఉన్నప్పుడు.. మోహన్‌బాబు విలన్‌గా చిరు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత మోహన్‌బాబు హీరో అయ్యి ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. ఎప్పటి నుంచో వీరి మధ్య ఏదో గ్యాప్ ఉంది. అది అప్పుడప్పుడు మోహన్‌బాబే బయట పెట్టేస్తూ ఉంటారు.
ఇది వజ్రోత్సవాల సందర్భంగా మోహన్‌బాబు చిరంజీవిపై ఉన్న కోపాన్ని అసహనంతో చూపిస్తూ బరస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత వీరు మళ్లీ చాలాసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొద్ది నెలల క్రితమే నార్త్‌లో విడికి ఇద్దరూ మాత్రమే కలిసి వెళ్లారు. ఆ తర్వాత మా ఎన్నికల సందర్భంగా వీరి మధ్య మళ్లీ పొరాపొచ్చలు వచ్చాయి. ఇక తాజాగా మనోజ్ వర్సెస్ నాగబాబు మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఏదేమైనా మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య వార్ అయితే ఆగడం లేదు.
గతంలో చిరంజీవి మంచు లక్ష్మి హోస్ట్‌గా చేసిన ఓ షోకు గెస్ట్‌గా వెళ్లారు. అప్పుడు లక్ష్మి రాఫిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా ఈ ఇద్దరిలో మీకు ఎవరు ఇష్టం అని నాగార్జున – మోహన్‌బాబు పేర్లు చెప్పింది. అప్పుడు చిరు మోహన్‌బాబు అని ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత చిరు నవ్వుతూ ఈ పేరు చెప్పకపోతే నువ్వు ఈ ఎపిసోడ్ మొత్తం కట్ చేస్తావు కదమ్మా అన్నారు. అయితే ఆ తర్వాత కూడా చాలాసార్లు చిరు మోహన్‌బాబుది – తనది టామ్ అండ్ జెర్రీ బంధం అని మోహన్‌బాబుకు చిరు కోపం వచ్చినా తాము కలిసిపోతామని అన్నారు.
ఇక కోదండ రామిరెడ్డి..రాఘవేంద్రరావు ఇద్దరిలో ఎవరు మంచి డైరెక్టర్ అని అడగ్గా వెంటనే చిరు కోదండ రామిరెడ్డి పేరు చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఎందుకంటే చిరు – కోదండ రామిరెడ్డి కాంబోలో ఏకంగా 24 సినిమాలు వచ్చాయి. చిరు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లు అన్ని ఎక్కువుగా కోదండ రామిరెడ్డే ఇచ్చారు. అందుకే చిరు నిర్మొహమాటంగా ఆయన పేరు చెప్పారు.
ఇక బెస్ట్ యాక్టర్లుగా చరణ్, బన్నీల్లో ఎవరు అని అడిగినప్పుడు ఇది చాలా కష్టమైన ప్రశ్న అని చెప్పారు. ఒకరు నిలకడగా చేస్తే.. మరొకరు గెంతుతూ చేస్తారు అని ఆన్సర్ చేశారు. ఇక చక్రవర్తి, ఇళయరాజాలలో ఎవరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రశ్నించగా చిరు ఇళయరాజా పేరు చెప్పారు. ఇళయరాజా పేరు ఎవరి పక్కన పెట్టినా ఆయన పేరే చెపుతానని చిరు అన్నారు.