టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ స్టార్స్‌గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత తెరకెక్చించిన ఈ సినిమాపై ఆకాశాన్ని మించిన అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. ఇక వారం రోజులుగా అయితే తెలుగు గడ్డపై ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే చర్చ నడిచింది. ఇక ఇండియన్ సినిమా జనాలు కూడా బాహుబలి ది కంక్లూజన్ మ్యాజిక్‌నే రాజమౌళి రిపీట్ చేస్తాడా ? అని చర్చించుకున్నారు.
ఇక ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ త్రిబుల్ ఆర్ కు దేశవ్యాప్తంగా భాషలతో సంబంధం లేకుండా యునానమస్ హిట్ టాక్ వచ్చింది. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ అనుభవించారు. ఎట్టకేలకు ఈ రోజుతో ఆ ఉత్కంఠ తీరిపోయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన త్రిబుల్ ఆర్ పై రిలీజ్‌కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలు అన్ని ఈ సినిమా అందుకుంటోంది.
అన్ని భాషల్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, మేథావులు కూడా యునానమస్‌గా హిట్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే త్రిబుల్ ఆర్‌కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. అసలు కళ్లు చెదిరిపోయే విజువల్ వండర్‌ను రాజమౌళి తన ఖాతాలో వేసుకున్నాడనే అంటున్నారు. ఓవరాల్‌గా 20 ఏళ్ల కెరీర్లో అస్సలు అపజయం అన్నది లేకుండా దూసుకు పోతోన్న రాజమౌళి ఖాతాలో మరో హిట్ అయితే పడింది.
అయితే రాజమౌళి తన ప్రతి సినిమాకు తన సినిమాల పాత రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ వస్తాడు. బాహుబలి 2 తర్వాత వచ్చిన ఈ త్రిబుల్ ఆర్ ఆ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసే విషయంలో మాత్రం సందేహాలే ఉన్నాయి. ఏదేమైనా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఓవర్సీస్‌లో అయితే మాత్రం టాక్ అదిరిపోయింది. అయితే నార్త్‌లో మాత్రం ఇంకా అనుకున్నంత టాక్ రాలేదు. అక్కడ మనిహా దేశం అంతటా అరాచకమైన టాక్‌తో బాక్సాఫీస్ కుంభస్థలమే బద్దలయ్యే రేంజ్‌లో దూసుకుపోతోంది.