ఫ్యాన్స్ హీరోలను దేవుళ్లులా కొలుస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే పది రోజుల ముందు నుంచే వారి హంగామా మామూలుగా ఉండదు. ఇక రేపు రిలీజ్ ఉందంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోల కోసం పెద్ద ఎత్తున సందడి చేస్తారు. ఇక కటౌట్లు, పాలాభిషేకాలు, బెనిఫిట్ షోల కోసం భారీగా టిక్కెట్ల కొనుగోళ్లు మామూలు రచ్చ ఉండదు. ఇక టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్.
మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటోన్న త్రిబుల్ ఆర్ ఎట్టకేలకు ఈ నెల 25న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఆదాయమే రు. 225 కోట్లు వచ్చిందని చెపుతున్నారు. ఇక రు. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో త్రిబుల్ ఆర్ రంగంలోకి దిగుతోంది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ ఉండడంతో ఇద్దరు హీరోల అభిమానుల సందడి మామూలుగా లేదు.
ఇక అమెరికాలో గతంలోనే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నప్పుడు ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి. ఇక ఇప్పుడు కూడా ఇరవై రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 24 ప్రీమియర్ ల నుంచి భారీ సంఖ్యలో షోలు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఏ సినిమా రిలీజ్ చేయని విధంగా భారీ ఎత్తున థియేటర్లు త్రిబుల్ ఆర్‌కు కేటాయిస్తున్నారు. ఓ ఎన్టీఆర్ వీరాభిమాని అయితే ఏకంగా 75 టిక్కెట్లు కొనుగోలు చేశాడు.
టెక్సాస్ – డల్లాస్ లోని గెలాక్సీ థియేటర్లో ఈ సినిమా షో చూసేందుకు ఓ వీరాభిమాని ఎన్టీఆర్‌పై తనుకు ఉన్న అనంతాభిమానం చాటుకున్నాడు. అటు రామ్‌చరణ్ అభిమానులు కూడా భారీ ఎత్తున టిక్కెట్లు బుక్ చేస్తున్నారట. ఓవరాల్‌గా చూస్తే ప్రీ బుకింగ్ సేల్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇటు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సినిమా హంగామా అయితే ఎలా ఉందో ఇవే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇటు ఎన్టీఆర్ నుంచి అరవింద సమేత వీరరాఘవ తర్వాత సినిమా రాలేదు. అటు వినయవిధేయ రామ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ సినిమా రాలేదు. మరి ఈ సినిమా ఈ ఇద్దరు హీరోల ఇమేజ్‌ను ఏ స్థాయిలో మార్చబోతుందో ? చూడాలి.