మెగాస్టార్ చిరంజీవి ఒక్కోసారి చాలా సరదాగా ఎలాంటి భేషజాలు లేకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. చిరు ఆ టైంలో అలా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా చిరు నుంచి మాంచి హిలేరియస్ ఎపిసోడ్ ఒకటి నడిచింది. తనకు హీరోయిన్ తాప్సీ కావాలంటూ చిరు చిన్న పిల్లాడిలా మారాం చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. అసలు మ్యాటర్‌లోకి వెళితే చిరంజీవి మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫంక్షన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే ఈ ఫంక్షన్‌కు వచ్చానని చెప్పిన చిరు తాప్సీ గురించి మాట్లాడుతూ చిన్న పిల్లాడు అయిపోయారు.
ఝుమ్మంది నాదం సినిమా టైమ్‌లోనే తాను తాప్సీని చూశానని.. పాప చాలా మంచి హుషారుగా ఉందని అనుకున్నానని.. అయితే ఆ టైంలో తాను రాజకీయాల్లోకి వెళ్లడంతో తాప్సీతో నటించే అవకాశం రాలేదని.. అయితే తాప్సీని ఎప్పుడు చూసినా కూడా ఎందుకు పాలిటిక్స్‌లోకి వెళ్లానా ? అన్న బాధ అయితే తనకు కలుగుతూ ఉంటుందని చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు ఒక్కసారిగా తాప్సీని ఇంతలా ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె అయితే సిగ్గుల బుగ్గ అయిపోయింది. పక్కనే ఉన్నోళ్లు కూడా ఆశ్చర్యపోయారు.
అక్కడితో ఆగని చిరు ఈ సారి తాప్సీతో సినిమా తీస్తే ఆమె పక్కన తనకు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలంటూ నిర్మాత నిరంజన్ రెడ్డిని కోరారు. దర్శకుడిగా ఎవరిని తీసుకున్నా.. తనకు అభ్యంతరం లేదని చెప్పిన చిరు ఓ కండీషన్ కూడా పెట్టారు. సిల్వర్ స్క్రీన్‌పై తనను తాప్సీ డామినేట్ చేయకూడదని ఆయన చెప్పారు. ఇదంతా చిరు సరదాగానే అన్నారు. కానీ ఆయన తాప్సీని అంతలా ఆకాశానికి ఎత్తేయడంతో పాటు.. తాను ఓ స్టార్ అన్న తీరు మర్చిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఖుషీ చేసింది.
తాప్సీ చాలా రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమా చేసింది. మరి ఈ సినిమా హిట్ అయితే చిరు లాంటి సీనియర్ల పక్కన ఆమెకు అవకాశాలు రావొచ్చు. బాలీవుడ్‌పై బాగా కాన్సంట్రేషన్ చేశాక ఆమె సౌత్ వైపు.. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఆనందోబ్రహ్మ లాంటి ఒకటీ అరా సినిమాలు చేసి సరిపెట్టేసుకుంది. మరి ఈ సినిమాతో అయినా ఆమె ఫేట్ ఇక్కడ మారుతుందేమో ? చూడాలి.