నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యారు. అల్లు అరవింద్ ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పెద్ద బిజినెస్ మెన్ అయినా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు.. దీనికి తోడు ఏపీలో సినిమా రంగం ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొందో చూస్తూనే ఉన్నారు. దీంతో ఆయన బిజినెస్ లెక్కలతో పాటు భవిష్యత్తులోనూ నందమూరి బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలన్నదే ఆయన స్కెచ్.
వాస్తవానికి ఎప్పటి నుంచో మెగా కాంపౌండ్ వర్సెస్ నందమూరి కాంపౌండ్ మధ్య సినిమాల పరంగా పెద్ద పోటీ ఉంటుంది. అయితే అరవింద్ నందమూరి బంధాన్ని బలంగా కోరుకుంటున్నారు. అందుకే బాలయ్యను తీసుకువచ్చి ఏకంగా అన్‌స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్‌గా చేయించారు. అయితే అరవింద్ తీసుకున్న ఈ నిర్ణయం అల్లు – మెగా బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ షో సూపర్ హిట్ అయ్యి ఇటు బాలయ్యకు మంచి పేరు రావడంతో పాటు అటు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు కూడా సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.
తర్వాత బాలయ్య అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ రావడం.. ఇలా అల్లు – నందమూరి బంధం బాగా బలపడింది. ఇక గతంలో ఎన్టీఆర్ – అల్లు రామలింగయ్య చాలా స్నేహంగా ఉండేవారు. ఇప్పుడు ఈ తరంలోనూ ఆ బంధాన్ని అరవింద్ కంటిన్యూ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే తన గీతా ఆర్ట్స్‌లో నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో అరవింద్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా బాలయ్యతో ఎలాగూ ట్రావెల్ అవుతున్నందున ఆయనతోనే సినిమా ఉంటుందని భోగట్టా ?
బాలయ్య – బోయపాటి కాంబినేషన్లోనే గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా ఉంటుందని గీతా కాంపౌండ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అది ఎప్పుడు అయినా ఉండొచ్చని అంటున్నారు. ఇక బన్నీకి – ఎన్టీఆర్‌కు చాలా క్లోజ్ మూమెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ బన్నీని ఏకంగా బావా అని సంబోధిస్తూ ఉంటాడు. అరవింద్ ప్లానింగ్, బన్నీతో రిలేషన్ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా అరవింద్ మెగా కాంపౌండ్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. వారితో కాకుండా ఇలా గీతా బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ బాలయ్య, ఎన్టీఆర్‌తో సినిమాలు ప్లాన్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నారు.