ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే..హీరో హీరోయిన్లు వేసే డ్రెసులు కానీ, షూస్ కానీ,వాడే కార్లు కానీ..బాగా కాస్ట్లీ గా ఉంటున్నాయి. మనలాంటి సామాన్యులు ఒక్క వస్తువు కొనాలి అన్నా..లేక డ్రేస్ కొనాలి అన్నా..ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి..ఎక్కడ తక్కువ కి దొరుకుతుంది..లేక మనం పెట్టే డబ్బులకి వర్త్ నే నా అని తెగ ఆలోచించి..చించి..ఫైనల్ గా తక్కువ బడ్జెట్ లో మనకు కావాల్సినవి కొనుకుంటాం.
కానీ సెలబ్రిటీలు అలా కాదు.. కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు కొనుకుంటారు. వేలలో కాదు లక్షల్లోనే ఉంటున్నాయి. పోనీ అంత డబ్బు పెట్టి కొన్న బట్టలని మళ్ళీ వాడుతారా అంటే అది లేదు. దీంతో ఈ సెలబ్రిటీల బట్టలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటున్నాయి. ఈ మధ్యనే సమంత,మెహ్రీన్, నేహాశెట్టి, రష్మిక, కీర్తి సురేష్, వేసుకున్న డ్రెసు లు ..వాటి ధరలు బాగా వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయింది..మాళవిక మోహనన్.
మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ చేసింది తక్కువ సినిమాలే.. అయినా ప్రేక్షకులల్లో ఆమె క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆమె వేసే బికినీ అందాలకు మైమరచిపోతారు. ఓ రేంజ్లో అందలు అరబోస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులోకూడా సినిమాలకు సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె దిగిన ఫోటో ఒకగా నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని ఫోటోకి ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలో ఆమె వేసుకున్న డ్రెస్ ధర అక్షరాల లక్షా అరవై వేలు(1,60,000). ఈ డ్రెస్ ని ప్రముఖ డిజైనర్ కరణ్ తోరానీ డిజైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ డ్రెస్ లో అమ్మడు చాలా క్యూట్ గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు పట్టుమంటే పది సినిమాలు కూడా చేయని మాళవిక కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చిన్నట్లు ఉన్నారు..అందుకే ఇంత డబ్బులు డ్రెస్ లకు పెడుతుంది. స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలవడంలో ఈమె అస్సలు తగ్గడంలేదే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందని కామెంట్స్ సెక్షన్ చూస్తేనే అర్ధమైపోతుంది.