నాలుగేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది కేజీఎఫ్ సినిమా. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కన్నడ బాహుబలిగా ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. యశ్ అయితే కన్నడ రాకింగ్ స్టార్ అయిపోయాడు. కేజీఎఫ్ తర్వాత అసలు యశ్ నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజీ హీరో అయిపోయాడు. బాహుబలి సినిమాల్లాగానే కేజీఎఫ్ కూడా సౌత్ టు నార్త్‌లో బాగా పాపులర్ అయిపోయింది.
ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా.. కంటిన్యుటిగా కేజీఎఫ్ 2 వస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా లెవల్లో భారీగా రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలే ఇండియా వైజ్‌గా ఉన్నాయి. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు సేమ్ త్రిబుల్ ఆర్ లాగా కథ, కథనాల మీద కూడా కాకుండా ఎలివేషన్ సీన్లు, గ్రాండియర్ మీదే కాన్‌సంట్రేషన్ చేసినట్టుగా అనిపిస్తోంది.
పాన్ ఇండియా సినిమా అనే సరికి దర్శకులు తప్పటడుగులు వేస్తున్నారు. కథ, కథనాల మీద కాకుండా గ్రాండియర్ విజువల్స్ ఉండాల్సిందే అని డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు. త్రిబుల్ ఆర్ విషయంలో ఇదే కాస్త కంప్లైంట్‌గా అనిపించింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ 2 ట్రైలర్ చూసిన వాళ్లు కూడా అదే అంటున్నారు. కేజీఎఫ్ వన్ కంటే మించి ఉండాలనే జెట్‌లు, షిప్‌లు ఇలా ఏది పడితే అది వాడేసినట్టే ఉంది.
ఇక రాజకీయం కూడా బలవంతంగా కథలోకి ఇరికించేసినట్టే ఉంది. ఏదేమైనా ట్రైలర్ అయితే భారీ తనం కనిపించింది. అయితే కథ ఏంటన్నది క్లారిటీ లేదు. కావాలనే కథను దాచి పెట్టారా ? లేదా కథను మించి గ్రాండియర్ మీదే కాన్‌సంట్రేషన్ చేశారా ? అన్నది చూడాలి. కేజీఎఫ్‌లో కథ కంటే ఎమోషన్లే డామినేషన్ చేశాయి. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అలాగే చేశారేమో అనిపిస్తోంది.
అయితే కేజీఎఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 అలా కాదు.. భారీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ అయితే భారతనాన్ని నమ్ముకున్నట్టే ఉంది. మరి సినిమా ఏం చేస్తుందో ? చూడాలి.