కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలు సంచలనంగా మారుతున్నాయి. వరుసగా రిలీజ్ అవుతోన్న సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను తలదన్నేస్తున్నాయి. పుష్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్లో ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక రాధేశ్యామ్ ప్లాప్ అయినా బాలీవుడ్లో ప్రి రిలీజ్ పరంగా షేక్ చేసింది. ఇక త్రిబుల్ ఆర్ అయితే కుమ్మేస్తోంది. ఇప్పటికే రు. 100 కోట్లు దాటేసి రు. 150 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మరో సౌత్ ఇండియన్ సినిమా మీదే ఉంది. అదే కేజీయఫ్ 2.
శాండల్‌వుడ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం 2018 చివర్లో కేజీయఫ్ పార్ట్ 1 వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం కన్నడంలో మాత్రమే కాదు.. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు అటు నార్త్‌ను కూడా ఓ ఊపు ఊపేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కేజీయఫ్‌ను కన్నడ బాహుబలి అంటూ కీర్తించారు.
ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మధ్యలో మూడు కరోనా కష్టాలను దాటుకుని పార్ట్ 2 వస్తోంది. పార్ట్ 1 రిలీజ్ అయ్యాక యశ్ కన్నడ రాకింగ్ స్టార్ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ 1,2 తీస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను కూడా లైన్లో పెట్టాడు. మన తెలుగు హీరోలు ఒప్పుకోవాలే కాని.. మైత్రీ వాళ్లు ప్రశాంత్ నీల్‌తో ఎన్ని కాంబినేషన్లు అయినా సెట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.
ఇక ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోన్న కేజీయఫ్ పార్ట్ 2 సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. CBFC నుండి U/A సర్టిఫికెట్ పొందింది.ఈ చిత్రం 168 నిమిషాల రన్ టైంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిబుల్ ఆర్తో పాటు మన తెలుగులో వస్తోన్న పెద్ద సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అనుకోవాలి. అయితే అంత మూడు గంటలకు 12 నిమిషాల తక్కువ రన్ టైంతో వస్తున్నప్పటకీ అంత సేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చో పెట్టాలంటే కథ, కథనంలో మ్యాజిక్ ఉండాలి. సెన్సార్ టాక్ ప్రకారం ఫస్ట్ పార్ట్ ను మించి డబుల్ కాదు త్రిబులే ఉంటుందని అంటున్నారు. ట్రైలర్లోనే కళ్లు చెదిరిపోయే యాక్షన్, విజువల్స్ చూశాం.
ఇప్పటికే ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్‌పై కనివినీ ఎరుగని అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. మెయిన్ విలన్ అథీరాగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటించాడు. ఇక రిమ్మకా సేన్‌గా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ఈ పాన్ ఇండియన్ సినిమా హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.