త్రిబుల్ ఆర్ సక్సెస్‌తో ఆ సినిమా యూనిట్‌తో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు గడ్డపై మరో వారం, పది రోజుల పాటు ఈ సినిమా హడావిడే ఉంటుంది. ఇక ఈ సినిమా హిట్‌తో ఎన్టీఆర్ ఈ తరం జనరేషన్ హీరోలకు గత 20 ఏళ్లలో సాధ్యంకాని అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తరం కుర్ర హీరోల్లో స్టార్ హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ లాంటి హీరోలకు వరుసగా ఆరు హిట్లు పడలేదు. అయితే అలాంటి అరుదైన రికార్డ్ ఎన్టీఆర్ ఖాతాలోనే పడింది.
2015కు ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడింది. రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్లు ఎన్టీఆర్‌ను బాగా డిఫ్రెషన్‌లోకి తీసుకుపోయాయి. తర్వాత 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కెరీర్ ట్రాక్‌లోకి ఎక్కింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్‌తో కలుపుకుని వరుసగా ఆరు హిట్లు కొట్టాడు. అంటే ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి డబుల్ హ్యాట్రిక్ హిట్ పడింది.
2015లో టెంపర్ – 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ – 2017 లో జైలవకుశ, 2018లో అరవింద సమేత వీరారాఘవ ఇప్పుడు 2022లో త్రిబుల్ ఆర్.. ఇలా వరుసగా ఆరు సూపర్ హిట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ తరం జనరేషన్లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా.. వాళ్లెవ్వరికి కూడా ఆరు వరుస హిట్లు లేవు. ఇక 2018లో అరవింద సమేత సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత మూడేళ్ల పాటు 2019, 2020, 2021లో తన అభిమానులను థియేటర్లలో పలకరించలేదు.
అయితే టైరు టు హీరోల్లో నేచురల్ స్టార్ నాని మాత్రం ఈ డబుల్ హ్యాట్రిక్ ఫీట్ అందుకున్నాడు. అయితే నాని మీడియం రేంజ్ హీరోగా ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఎన్నో ఇబ్బందుల తర్వాత ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్‌లో క్రేజీ సినిమాలే ఉన్నాయి.
త్రిబుల్ ఆర్ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మైత్రీ బ్యానర్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.