భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. బాహుబలి, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో రాజమౌళితో పాటు ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సరే ఈ సినిమా విజయంలో ఎవరు గొప్ప అంటే ఈ సినిమాను ఇంతలా ఎఫర్ట్ పెట్టి తీసిన రాజమౌళితో పాటు మూడేళ్ల పాటు ఈ సినిమాకు డేట్స్ ఇచ్చిన ప్రభాస్‌ను కూడా మెచ్చుకోవాలి.
సరే బాహుబలి సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి ఇచ్చి చూడట్లేదు కొందరు. ఈ విజయంలో ప్రభాస్ వాటా కూడా ఎక్కువే అంటున్నారు. కట్ చేస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చేశాడు. ఈ సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా నార్త్‌లో ఫస్ట్ డే ఏకంగా రు. 25 కోట్ల నెట్ రాబట్టింది. తెలుగులో ప్లాప్ అయినా ( అంటే బ్రేక్ ఈవెన్ రాకపోయినా) కూడా నార్త్‌లో ఏకంగా రు. 150 కోట్లు కొల్లగొట్టింది. ఇక తాజాగా వచ్చిన రాధేశ్యామ్ ఏకంగా రు 4.5 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. అదే పుష్ప సినిమా ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది.
ఇక ఇప్పుడు త్రిబుల్ ఫస్ట్ డే నార్త్‌లో కేవలం రు. 19 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో కొందరు ప్రభాస్ గొప్పా, జక్కన్న గొప్పా ? అన్న చర్చ తీసుకు వస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద రచ్చగానే మారింది. బాహుబలి క్రెడిట్ అంతా రాజమౌళిదే అని.. ఆ క్రేజ్‌తోనే సాహో ప్లాప్ అయినా నార్త్‌లో ప్రభాస్ నెట్టుకు వచ్చాడని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రాజమౌళిని సపోర్ట్ చేసేవాళ్లు.. సాహోకు నెగిటివ్ టాక్‌తో కూడా అక్కడ ఫస్ట్ డే రు. 25 కోట్ల నెట్ వచ్చిందని.. మరి త్రిబుల్ ఆర్‌కు ఇంత హైప్ ఉన్నా ఫస్ట్ డే కేవలం రు. 19 కోట్లు మాత్రమే రాబట్టింది ? ఇప్పుడు రాజమౌళి క్రెడిట్ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు.
మరి నిజంగా ప్రభాస్‌కు బాహుబలి తర్వాత ఓన్ క్రేజ్ ఉంటే రాధేశ్యామ్ ఏమైందని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు బాహుబలి మానియాతోనే ప్రభాస్‌కు ఈ రేంజ్ క్రేజ్ రావడంతో పాటు పాన్ ఇండియా స్టార్ అయ్యాడని అంటున్నారు. మరి కొందరు మాత్రం ప్రభాస్ పడిన కష్టంతోనే ఈ క్రేజ్ వచ్చిందని అంటుంటే.. మరి కొందరు రాజమౌళి వల్లే ప్రభాస్‌కు అక్కడ ఇంత క్రేజ్ వచ్చిందంటున్నారు. ఏదేమైనా ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతోన్న అర్ధరహితమైన చర్చలే అని చెప్పాలి.
ఏ మూవీ సక్సెస్ అయినా కూడా అది ఆ సినిమా కథ, కథనాలతో పాటు అందరి సమష్టి కృషి మీదే ఆధారపడి ఉంటుంది. త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అయినా కథ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. బాహుబలి 2 తో పోలిస్తే కాస్త వీక్ అంటున్నారు. ఎవరి లెక్కులు ఎలా ఉన్నా సమష్టి విజయం సూత్రం మీదే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక కొంత లక్ కూడా కలిసి రావాలి.