గాన గంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో అన్నగారు… విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. ఎన్టీఆర్‌కు వివాదం ఉందా? ఉంటే.. అసలు వివాదం ఎందుకు వచ్చింది? తర్వాత.. మళ్లీ వీరి మధ్య రాజీ చేసింది ఎవరు? ఇప్పటికీ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా ఆసక్తికర విషయాలు.. విషయంలోకి వెళ్తే.. సినీ రంగంలో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని సహా అనేక మందికి ఘంటసాల గాత్ర దానం చేసిన విషయం తెలిసిందే. అనేక వందల సినిమాల్లో ఘంటసాల వీరికి పాటలు పాడారు.
అయితే ఘంటసాల మరణం తర్వాత.. ఈ రోల్ బాలసుబ్రహ్మణ్యం తీసుకున్నారు. ఇద్దరు ఎన్టీఆర్, అక్కి నేనికి బాలునే గాత్రదానం చేస్తూ వచ్చారు. ఎన్నో భక్తిరస చిత్రాలు సహా సాంఘిక సినిమాలకు కూడా.. బాలూనే.. ఎన్టీఆర్‌కు గాత్రదానం చేశారు. అయితే.. ఆరాధన సినిమా విషయానికి వచ్చేసరికి.. అన్నగారు.. బాలును వద్దని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్‌లో దూసుకుపోతున్న మహమ్మద్ రఫీని తెలుగు తెరకు పరి చయం చేయాలని అనుకున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అన్నగారు నటించిన ఓ చిత్రం హిందీ లోకి డబ్ అయింది. దీనిని చూసిన.. రఫీ.. అన్నగారిని ప్రశంసించారు.
ఈ క్రమంలో అన్నగారితో రఫీకి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే వాణిశ్రీ-అన్నగారునటించిన ఆ రాధన సినిమాకు రఫీతో పాడించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని నిర్మాతతోనూ.. చెప్పారు. అయి తే.. అప్పటికే బాలుతో డేట్లు ఫిక్స్ అయిపోయాయి. అయినప్పటికీ.. ఎన్టీఆర్.. బాలును వద్దని చెప్పా రు. దీంతో బాలు కొంత స్పీడ్‌గా వ్యవహరించి..ఇకపై ఎన్టీఆర్‌కు పాడేది లేదని చెప్పారు. దీంతో ఆరాధనల రఫీ పాటలు పాడగా.. తర్వాత తీసిన.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్రలో రామకృష్ణతో పాటలు పాడించారు.
ఇక, అప్పటి ననుంచి దాదాపు పది సినిమాల వరకు కూడా రామకృష్ణతోనే అన్నగారు పాటలు పాడించు కున్నారు. అయితే.. మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు జోక్యం చేసుకుని.. ఇరువురి మధ్య సఖ్యత చేయాల ని ప్రయత్నించారు. ఎట్టకేలకు రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు జోక్యంగా.. ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. తర్వాత ఎప్పటికో..కానీ, బాలు అన్నగారికి గాత్రం అందించలేదు. ఇది అప్పట్లో జరిగిన సంగతి.
అయితే బాలుకు ఎన్టీఆర్‌తోనే కాదు.. సూపర్‌స్టార్ కృష్ణతోనే విబేధాలు వచ్చాయి. ఆ విబేధాలు తీవ్రతరం కావడంతో సింహాసనం సినిమాకు బాలును పక్కన పెట్టేసి రాజు సీతారాంను తీసుకువచ్చి పాడించారు. ఆ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇద్దరికి సయోధ్య కుదరడంతో కృష్ణ బాలునే కంటిన్యూ చేశారు.