టాలీవుడ్‌లో జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్) వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు. ఎక్కడో అమెరికాలో చదువుకున్న ఉన్నత ఉద్యోగం చేసుకునే క్రిష్ సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చారు. గమ్యం – వేదం సినిమాలతో క్రిష్ ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపునకు తిప్పేసుకున్నారు. క్రిష్ సినిమా అంటేనే నటీనటుల నుంచి నటన పిండేస్తారు. ఎంతో మంచి డైరెక్టర్‌గా పేరున్న క్రిష్ బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు శాతకర్ణి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు క్రిష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇక క్రిష్‌కు లేట్ వయస్సులో మ్యారేజ్ అయ్యింది. శాతకర్ణి రిలీజ్ అయ్యాక క్రిష్ రమ్య అనే కిమ్స్ హాస్పటల్ డాక్టర్‌ను పెళ్లాడారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పెళ్లి జరిగిన యేడాదిన్నర నుంచే వీరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఆ తర్వాత రెండేళ్లకే వీరు పరస్పర సమ్మతితో విడాకులు తీసేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. క్రిష్ సినిమాలు చూసినా.. ఆయన ప్రవర్తన చూసినా కూడా క్రిష్ విడాకులు తీసుకుంటాడని అనుకోరు. అలాంటిది క్రిష్ రెండేళ్లకే భార్యకు విడాకులు ఇచ్చేశాడు.
అయితే క్రిష్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఓ హీరోయినే కారణమన్న ప్రచారం బాగా జరిగింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఓ సినిమాకు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన టైంలో ఆ హీరోయిన్‌తో క్రిష్‌కు రిలేషన్ ఏర్పడిందట. పెళ్లి తర్వాత కూడా క్రిష్ రిలేషన్ కట్ చేసుకోకపోవడం భార్యకు కోపం తెప్పించిందని అంటారు. పెళ్లయ్యాక క్రిష్ చాలా నెలల పాటు ముంబైలోనే ఉంటూ కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా కోసం పనిచేశారు. ఆ టైంలో క్రిష్ భార్య రమ్యకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె నేరుగానే ముంబై వెళ్లి క్రిష్ ఆ హీరోయిన్‌తో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకుందని టాక్ వచ్చింది.
ఆ మనస్పర్థలతోనే రమ్యే ముందుగా క్రిష్‌కు విడాకులు ఇచ్చేయాలన్న నిర్ణయానికి వచ్చేసిందని అంటారు. భార్యకు విడాకులు ఇచ్చేశాక క్రిష్ బాలయ్య మహానాయకుడు, కథానాయకుడు సినిమాలు చేశారు. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం సినిమా తీసినా.. అది సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాతో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వస్తానన్న ధీమాతో క్రిష్ ఉన్నాడు.