ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా ఫలితం మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. సినిమా ఎలా ఉంటుంది ? సూపర్ హిట్టా ? లేదా మిక్స్‌డ్ టాక్ ఉంటుందా ? లేదా బాహుబలి రికార్డులనే తల దన్నేస్తుందా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిని తొలచి వేస్తున్నాయి. ఇలాంటి టైంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ఇప్పుడు త్రిబుల్ ఆర్ టెన్షన్ కోసం ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాడన్నది నిజం.
ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసేది మహేష్‌బాబునే. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కేఎల్. నారాయణ అటు రాజమౌళికి, ఇటు మహేష్‌బాబుకు ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఎప్పుడోనే మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే అది కుదర్లేదు.
ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ తర్వాత చేసే సినిమా మహేష్‌బాబుతోనే అని ఇప్పటికే ప్రకటించేశారు. బాహుబలి సీరిస్ సినిమాలు, త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ సినిమా కావడంతో మహేష్ సినిమా ఎలా ఉంటుంది ? అన్న ఉత్సుకతతో ఈ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా వసూళ్లు, లాభాలను బట్టే నెక్ట్స్ మహేష్ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి ? అన్నది ఆధారపడి ఉంటుంది.
రాజమౌళి సినిమా అంటేనే బయ్యర్లు జూదం ఆడేస్తున్నారు. బాహుబలి 1ను మించి బాహుబలి 2 సినిమాను కొన్నారు. అయితే ఆ సినిమా అంతకు మించి ఆడేసింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్‌ను కూడా బాహుబలి 2ను మించిన రేట్లకు కొన్నారు. పైగా కరోనాకు ముందే అడ్వాన్స్‌లు ఇచ్చి ఉన్నారు. ఈ లెక్కన ఇవన్నీ కలుపుకుంటే చాలా కట్టినట్టే అనుకోవాలి.
ఉన్నంతలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఇవ్వడమే వీళ్ల లక్కీ అనుకోవాలి. ఇక త్రిబుల్ ఆర్ ఆంధ్రాలో రు. 200 కోట్లు రాబట్టాలి. నైజాంలో రు. 150 కోట్లు కొల్లగొట్టాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలా జరిగితేనే మహేష్‌బాబు సినిమాకు రు. 500 కోట్లు ఖర్చు చేస్తారు. అప్పుడే దానిని పాన్ ఇండియా రేంజ్‌లో తీర్చిదిద్దగలుగుతారు.
ఈ టెన్షన్‌ల నేపథ్యంలోనే మహేష్ కూడా ఈ రోజే సినిమా చూస్తున్నాడు. తన ఏఎంబీ సినిమాస్‌లో స్మాల్ స్క్రీన్‌లో ఈ రోజు సినిమా వీక్షించే ఏర్పాట్లు చేసుకున్నాడు. దర్శకుడు మెహర్ రమేష్‌తో పాటు తన సన్నిహితులతో సినిమా చూడబోతున్నాడట. అయితే నమ్రత కూడా షోకు వస్తుందా లేదా ? అన్నది క్లారిటీ అయితే లేదు. ఏదేమైనా మహేష్ టెన్షన్ మామూలుగా లేదు.