దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో 9 రోజుల టైం మాత్రమే ఉంది. ఇండియా వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ బజ్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మామూలు అంచనాలు లేవు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. త్రిబుల్ ఆర్ మానియా ఎంతలా ఉందంటే పది రోజులకు ముందే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లతోనే ఏకంగా రు. 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్లు షురూ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్లలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, హీరోయిన్ అలియాతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ ఎన్టీఆర్ నటన గురించి ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. ఎన్టీఆర్‌ను గొప్ప నటుడు అని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. ఎన్టీఆర్‌తో నటించేటప్పుడే అంతకన్నా బాగా చేయాలన్న పట్టుదలతో ఉండేవాడిని అని చరణ్ తెలిపాడు.
ఇక నటనా పరంగా తనను తాను సరి చేసుకునేందుకు ఈ సినిమా తనకు ఎంతో సాయపడిందని రాజమౌళి తెలిపాడు. ఈ మూవీలో అల్లూరి పాత్ర తన కెరీర్‌లో ఎంతో స్పెషల్‌గా నిలిచిపోతుందని కూడా చరణ్ చెప్పాడు. ఏదేమైనా ఎన్టీఆర్‌ను.. చరణ్ ఇంతలా ఆకాశానికి ఎత్తేయడంతో తారక్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. రేపటి రోజు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకరి పాత్ర ఎక్కువ.. మరొక హీరో పాత్ర తక్కువా అన్న ఇగోలకు పోకుండా సినిమాను హిట్ చేస్తే మరింత బాగుంటుంది.
ఇక ఈ సినిమాకు రాజమౌళి కాకుండా మరో దర్శకుడు చేసి ఉంటే ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకునే వారా ? అన్న ప్రశ్నకు కూడా చరణ్ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. అసలు ఈ సినిమాకు దర్శకుడిగా వేరొకరిని ఊహించుకోవడమే కష్టంగా ఉందని చరణ్ చెప్పాడు. ఇక రు. 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతోన్న ఈ సినిమాలో చెర్రీకి జోడీగా అలియాభట్, తారక్‌కు జోడీగా ఒవీలియో మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందించారు.