Moviesసింహా టైటిల్ ఉంటే బాల‌య్యకు బ్లాక్‌బ‌స్ట‌రే.. ఈ సెంటిమెంట్ క‌థ ఇదే..!

సింహా టైటిల్ ఉంటే బాల‌య్యకు బ్లాక్‌బ‌స్ట‌రే.. ఈ సెంటిమెంట్ క‌థ ఇదే..!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకు సింహా అనే టైటిల్ బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. బాల‌య్య కెరీర్‌కు సింహా టైటిల్‌కు ఎంతో ముడిప‌డి ఉంది. సింహా అనే టైటిల్ బాల‌య్య సినిమాలో ఉందంటే ఆ సినిమా సూప‌ర్ హిట్టే. ఈ సింహా పేరుతో తీసిన చాలా సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్లుగానే నిలిచాయి. బాల‌య్య కెరీర్‌లో సింహా టైటిల్‌తో వ‌చ్చి హిట్ కొట్టిన సినిమాలు.. ఆ వివ‌రాలు చూద్దాం.

1. బొబ్బిలి సింహం (1994) :
బాల‌య్య – కోదండ రామిరెడ్డి కాంబినేష‌న్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్ద‌రి కాంబోలో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. 1994లో బొబ్బిలి సింహం సినిమా వ‌చ్చింది. మీనా, రోజా హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందించారు.

2 సమర సింహారెడ్డి ( 1999) :
బాల‌య్య – బి.గోపాల్ కాంబినేష‌న్ తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఎంత బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌నో తెలిసిందే. అప్ప‌టికే లారీడ్రైవ‌ర్‌, రౌడీఇన్‌స్పెక్ట‌ర్ సినిమాలు వీరి కాంబినేష‌న్లో వ‌చ్చాయి. ఇక 1999 సంక్రాంతి కానుక‌గా వీరి కాంబినేష‌న్లో మూడో సినిమాగా స‌మ‌ర‌సింహారెడ్డి వ‌చ్చింది. ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా చ‌రిత్ర గ‌తిని మార్చేసింది. 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకు కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాదే స్టోరీ ఇచ్చారు.

3. నరసింహనాయుడు ( 2001) :
స‌మ‌ర‌సింహారెడ్డి మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తూ 2001 సంక్రాంతి కానుక‌గా న‌ర‌సింహానాయుడు సినిమా వ‌చ్చింది. ఈ సినిమా భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోవ‌డంతో పాటు దేశ సినిమా ఇండ‌స్ట్రీ అంతా టాలీవుడ్ వైపు ప‌డేలా చేసింది. ఏకంగా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తొలిసారిగా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా అయ్యింది. ఈ సినిమాకు చిన్ని కృష్ణ క‌థ అందించారు.

4. లక్ష్మీనరసింహా ( 2004) :
కోలీవుడ్‌లో విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన సామి సినిమాకు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్‌కు సింగం హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ఇక్క‌డ ల‌క్ష్మీన‌ర‌సింహా పేరుతో రీమేక్ చేశారు. 2004 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా 277 కేంద్రాల్లో 50 రోజులు ఆడి స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది. బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌కొట్టేశాడు. జ‌యంత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

5. సింహా ( 2010 ) :
బాల‌య్య వ‌రుస ప్లాపుల‌తో ఉన్న‌ప్పుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో సింహా సినిమా వ‌చ్చింది. చాలా రోజుల త‌ర్వాత బాల‌య్య మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా క‌నిపించాడు. బాల‌య్య – బోయ‌పాటి హ్యాట్రిక్ కు సింహాతోనే బీజం ప‌డింది. ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశారు.

6. జై సింహా ( 2018 ) :
ఇక బాల‌య్య సింహా సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ 2018 సంక్రాంతి కానుక‌గా జై సింహా సినిమా వ‌చ్చింది. ఆ యేడాది సంక్రాంతికి రెండు సినిమాలే వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ కావ‌డంతో బాల‌య్య సంక్రాంతి హీరోగా నిలిచాడు. అలాగే ఆయ‌న సింహా సెంటిమెంట్ మ‌రోసారి ప్ల‌స్ అయ్యింది. కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు సీ క‌ళ్యాణ్ నిర్మాత‌.

7. సీమ‌సింహం (2002 :
2002 సంక్రాంతి కానుకగా సీమ‌సింహం సినిమా వ‌చ్చింది. సింహా ప‌దం రిపీట్ అయినా కూడా ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. బాల‌య్య సినిమాల‌కు వ‌రుస‌గా సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసే సీ రాంప్ర‌సాద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news