హృతిక్ రోషన్..బాలీవుడ్ స్టార్ హీరోలల్లో ఒకరు. ఆయన అంటించే సినిమాలు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఆయనను చూడటానికే సినిమాలకి వెళ్లే వారు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. గ్రీకు వీరుడిలా క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ 2000లో సుసానే ఖాన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హృతిక్ తొలి చిత్రం కహోనా ప్యార్ హై రిలీజైన కొన్ని నెలలకే అతను సుసానేను ప్రేమించి పెళ్లాడాడు. కానీ ఏమైందో తెలీదు.. వీరిద్దరు 2013లో విడిపోతున్నట్టు ప్రకటించారు. 2014లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.
అయితే విడాకుల తరువాత కొంత కాలం బాగానే ఉన్న ఈయన మళ్ళీ అమ్మాయిలతో డేటింగ్ లు స్టార్ట్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. ఆ మధ్య హీరోయిన్ కంగనా తో డేటింగ్ చేస్తున్నాడని..త్వరలో నే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అలాంటివి ఏం జరగలేదు. అయితే కొత్తగా మళ్ళీ హృతిక్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా అటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 48 ఏళ్ళ అందగాడు హృతిక్ కుర్ర బ్యూటి నటి సబా ఆజాద్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలు రాసింది. అయితే ముందుగా రెస్టారెంట్ లో కెమెరాలకి చిక్కిన ఈ జంట ఆ తర్వాత పబ్బులు, ఈవెంట్లు అంటూ కలిసి తిరుగుతూ పబ్లిక్ లోకొచ్చి.. కెమెరాలను చూసి తప్పించుకోవాలని చూసారు.
ఈ మధ్యనే ఓ సారి ఏకంగా ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ మొత్తంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేసాడు. దీంతో వాళ్ళ మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం నడుస్తుందని అర్ధమైపోయింది. కానీ, రీసెంట్ గా ఈ రొమాంటిక్ జంట కలిసి షాపింగ్ కు వెళ్ళి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పెళ్ళికి సంబంధించిన షాపింగ్ కే వెళ్లి ఉంటారని బాలీవుడ్ మీడియా కొడై కూస్తుంది. ఇక కొందరు అయితే హృతిక్ పెళ్ళి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని రేపో మాపో అఫిషియల్ గా ప్రకటీంచనున్నారని అంటున్నారు. మరి వార్తల్లో ఎంత నిజం ఉందీఓ అనేది ఆయన పెళ్ళి డేట్ అనౌన్స్ చేశాకానే తెలుస్తుంది.