ప్రపంచ వ్యాప్తంగా మరి కొద్ది గంటల్లోనే త్రిబుల్ ఆర్ బొమ్మ థియేటర్లలో పడిపోనుంది. ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ నిరీక్షణకు తెరపడబోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు త్రిబుల్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఒక్కటే ఎదురు చూపులు. సినిమా టాక్ ఎలా ? ఉన్నా కూడా తొలి మూడు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తాయి. కలెక్షన్లు కుమ్మేస్తాయి. రికార్డులు బద్దలైపోవడం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే అన్ని టిక్కెట్లు బుక్ అయిపోయాయి.
ఇక ఓవర్సీర్‌లో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్‌తో బాహుబలి 2 రికార్డును కూడా త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసేసింది. ఇక ఇప్పుడు ఫస్ట్ డే ఈ షో చూసేయాలన్న ఆతృత తెలుగు ప్రజల్లో ఎక్కువుగా ఉంది. చివరకు టిక్కెట్ల కోసం మామూలుగా ఒత్తిళ్లు తేవడం లేదు. టిక్కెట్లు ఇవ్వకపోతే మీ అంతు చూస్తాం అని థియేటర్ల ఓనర్లకు బెదిరింపులు సైతం వెళుతున్నాయి.
అది హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్. ఆ థియేటర్ మేనేజర్‌కు మేం ఆ మంత్రి తాలూకూ మనుషులం… మాకు 10 టిక్కెట్లు కావాలి.. మాకు 50, 100 టిక్కెట్లు కావాలంటూ విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. లేవు అని చెప్పినా.. రెండు లేదా మూడు ఇస్తాం సర్దుకోమని చెప్పినా అసలు ఈ మల్టీఫ్లెక్స్ ఉంటుందా ? అని బెదిరిస్తున్నారట. కొందరు వీఐపీలో పేర్లు చెప్పి.. మరి కొందరు పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి.. థియేటర్ల ఓనర్లను, మేనేజర్లను బెదిరిస్తోన్న పరిస్థితి.
చివరకు ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక మనం పైన చెప్పుకున్న మల్టీఫ్లెక్స్ మేనేజర్‌కు విపరీతమైన బీపీ వచ్చి హైదారాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పటల్లో చేరాల్సి వచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు పనిచేసిన ప్రధాన టెక్నీషియన్లకు సైతం టిక్కెట్లు దొరకడం లేదట. ఓ ప్రధాన టెక్నీషియన్ అయితే 100 టిక్కెట్లు కావాలని నిర్మాత దానయ్యకు పదే పదే ఫోన్లు చేశారట. దీంతో ఆయన 100 నా వల్ల కాదంటూ 10 టిక్కెట్లు మాత్రమే పంపారట.
చివరకు కొందరు రాజమౌళిని అడుగుతున్నా తాను కూడా ఫస్ట్ డే అంటే గ్యారెంటీ ఇవ్వలేనని.. రెండో రోజు చూద్దాం అని చెపుతున్నారట. అప్పట్లో బాహుబలి 2 సినిమా కోసం ఇంత బజ్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా టిక్కెట్ల కోసం ఇంత రచ్చ జరుగుతోంది. ఏదేమైనా రాజమౌళి సినిమాయా ? మజకానా ?