డైరెక్టర్ వంశీ పేరు చెపితేనే మనకు గోదావరి పల్లెలు… గోదావరి తీరాలు ఇలా ఎన్నో మరపురాని మధురానుభూతులు గుర్తుకు వస్తాయి. వంశీ సినిమాలు అన్నీ పల్లెల నేపథ్యంలోనే కొనసాగుతాయి. ఆయన కథల్లో స్వచ్ఛమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. వైవిధ్యమైన సినిమాలకు వంశీ పెట్టింది పేరు. వంశీ సినిమాల్లో హీరోయిన్లును చాలా బాగా చూపిస్తారు. అచ్చ తెలుగు ఆడపడుచుల్లా వంశీ హీరోయిన్లు ఉంటారు. ఇక వంశీకి – భానుప్రియకు మధ్య ఏదైనా ప్రేమకథ ఉందా ? అంటే ఈ తరం జనరేషన్లో చాలా మందికి తెలియదు.
ప్రముఖ కెమేరామెన్లలో ఒకరు అయిన ఎంవీ. రఘు తాజా ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను, వంశీ కలిసి విశ్వనాథ్ గారితో పనిచేశామని.. విజయబాపినీడు డైరెక్ట్ చేసిన మగమహారాజు సినిమాతో తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని రఘు తెలిపారు. అప్పట్లో వంశీకి, తనకు విబేధాలు ఉన్నట్టు ప్రచారం జరిగేదని.. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని.. తమ ఇద్దరి మధ్య కొన్ని చర్చలు అయితే జరిగేవని రఘు చెప్పారు.
మేకప్ ఎక్కువుగా బ్రైట్‌గా వస్తే తమ ఇద్దరి మధ్య వాదోపవాదాలు నడిచేవని రఘు చెప్పారు. ఓ సినిమాలో హీరోయిన్ భానుప్రియకు మేకప్ ఎక్కువవ్వడంతో తాను ఈ విషయాన్ని అందరిముందు చెప్పడంతో వంశీ ఫీలయ్యాడని.. ఆ తర్వాత భానుప్రియ కూడా హర్ట్ అయ్యిందట. ఈ విషయాన్ని వంశీ తనతో చెప్పాడని.. అయితే ఆ సమయంలో తాను మాత్రం తప్పు చేయలేదని.. తనది తప్పు కాదని.. తాను మాత్రం సారీ చెప్పలేనని.. అవసరం అయితే సినిమా మానేస్తానని వంశీతో అన్నానని రఘు అన్నారు.
ఇక వంశీ – భానుప్రియ గురించి వచ్చిన గాసిప్స్‌పై కూడా రఘఘు స్పందించాడు. ముందు భానుప్రియను అతడు ఇష్టపడడం మొదలు పెట్టాడని.. ఇక కెరీర్ ఇచ్చాడు కాబట్టే ఆమె కూడా కోపరేట్ చేసిందని రఘు సంచలన విషయాలు చెప్పాడు. అయితే వారిద్దరి మధ్య వచ్చిన వార్తలలో కొన్ని నిజాలు ఉంటే.. మరికొన్ని గాసిప్‌లు కూడా ఉన్నాయని రఘు చెప్పాడు.