టాలీవుడ్‌లో సీనియర్ హీరో శ్రీకాంత్‌ది విలక్షణ శైలీ. శ్రీకాంత్ ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. 1990వ దశకంలో సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్ అసలు పేరు మేకా శ్రీకాంత్… వీళ్లది ఆంధ్రా మూలాలు ఉన్న కర్నాకట కుటుంబం. శ్రీకాంత్ ఫ్యామిలీ కర్నాకటలో ఉండేది. 1990వ దశకంలో సినిమాలపై ఇంట్రస్ట్‌తో చెన్నై చెక్కేశాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీకాంత్ ఆ తర్వాత విలన్‌గా వేషాలు వేసి.. మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. ఒకప్పుడు చిన్న నిర్మాతలకు పెద్ద హీరోగా శ్రీకాంత్ ఉండేవాడు. శ్రీకాంత్‌తో మీడియం బడ్జెట్‌తో సినిమాలు చేసి సూపర్ హిట్లతో భారీ లాభాలు తెచ్చుకున్న నిర్మాతలు ఉన్నారు. పెళ్లి సందడి లాంటి సినిమాలే ఇందుకు పెద్ద ఉదాహరణ.
ఇంకా చెప్పాలంటే శ్రీకాంత్ నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యి హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సకుటుంబ సపరివారసమేతం, తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక శ్రీకాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి అఖండ సినిమాతో పవర్ ఫుల్ విలన్‌గా కూడా మారిపోయాడు. శ్రీకాంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒకప్పటి హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఊహ 1990 – 1995 టైంలో ఫేమస్ హీరోయిన్.
ఆమె చూపులు, అమాయకత్వం అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఊహా – శ్రీకాంత్ కలిసి వరుసగా సినిమాలు చేస్తోన్న టైంలో ఆమె అమాయకత్వం శ్రీకాంత్‌ను ఆకట్టేసుకుంది. ఆమె చూపులకు శ్రీకాంత్ చూపులు కలిసిపోయి ఆమెతో ప్రేమలో పడిపోయాడు. తర్వాత శ్రీకాంత్ ఇంట్లో ఫంక్షన్లకు కూడా ఊహ వెళ్లేది. శ్రీకాంత్ ఇంట్లో ఫంక్షన్లకు రావడంతో వాళ్లకు కూడా ఉహా బాగా నచ్చేసింది. అయితే ముందుగా ఊహాకు ప్రపోజ్ చేసింది తానేనని.. ఆ తర్వాత ఆమెతో పాటు ఆమె ఇంట్లో వాళ్లు ఓకే చేశారని శ్రీకాంత్ చెప్పాడు.
అయితే శ్రీకాంత్ విషయంలో ఊహ కుటుంబ సభ్యులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా చివరకు ఓకే చెప్పారు. అలా వాళ్ల పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు ఓ కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ – ఊహ పెద్ద కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా నిర్మలా కాన్వెంట్ ప్లాప్ అయినా తన తండ్రి నటించిన బ్లాక్‌బస్టర్ పెళ్లిసందడి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన పెళ్లిసందD సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టాడు.
ఇక ఇప్పుడు మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు రోషన్ రు. 5 కోట్లు వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటు శ్రీకాంత్ అఖండలో విలన్ పాత్ర సక్సెస్ కావడంతో సైడ్ రోల్స్, విలన్ రోల్స్‌లో కూడా మంచి ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.