సినిమా రంగంలో యువ హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడడాలు, డేటింగ్లు చేయడాలు.. పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అయిపోయాయి. పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా కూడా కొందరు కొంత కాలం లైఫ్ ఎంజాయ్ చేసేందుకో.. లేదా ఏదోలా ఫేమ్ తెచ్చుకునేందుకో ఇలా డేటింగ్లు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరో కూడా ఓ నటితో ప్రేమలో పడ్డారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రియల్ ప్రేమలో పడ్డాడా ? అంటు అవుననే అంటున్నాయి ముంబై మీడియా వర్గాలు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు మేనళ్లుడిగా వెండితెరం గ్రేటం చేసిన సందీప్ కిషన్ కరోనాకు ముందు కొన్ని సినిమాలు చేశాడు. ఇటీవల సందీప్ జోరు తగ్గింది. తాజాగా సందీప్ సీరియస్ రిలేషన్ షిఫ్‌లో ఉన్నాడన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. సందీప్ డేటింగ్లో మునిగి తేలుతోన్న ఆ నటి ఎవరో కాదు.. సోనియా రాథీ.
బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ , డీకఫుల్డ్ టీవీ సీరియల్లో నటించిన సోనియా రాథీ ప్రస్తుతం తార వర్సెస్ బిలాల్, నైట్ ఎనౌకౌంటర్స్ సినిమాల్లో నటిస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన సందీప్, సోనియా ప్రస్తుతం రిలేషన్లో ఉన్నారని.. వీరు సహజీవనం చేస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. సందీప్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. సందీప్ నటిస్తోన్న మైఖేల్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.