అబ్బో బాలయ్య ఇప్పుడు తన కెరీర్‌లోనే మామూలు ఫామ్‌లో లేడుగా… ఇప్పుడు బాలయ్య ఏం చేసినా ఎదురొచ్చేదే లేదు అన్నట్టుగా ఉంది. కరోనా కష్టకాలంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్‌లు, పుష్పలతో పోలిస్తే బాలయ్య సినిమాకు రు. 200 కోట్లే వచ్చి ఉండొచ్చు.. కానీ బాలయ్య అఖండ కేవలం తెలుగులో మాత్రమే వచ్చిన ప్రాంతీయ భాషా సినిమా. అది కూడా కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా ? అని ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ అఖండను వదిలేశాడు. పైగా ఏపీలో టిక్కెట్ రేట్లు కూడా తక్కువే… అయితే అఖండ దెబ్బకు అవన్నీ పటాపంచలు అయిపోయి మరి థియేట్రికల్‌గానే రు. 150 కోట్లు వచ్చాయి.
ఇక అఖండ సక్సెస్‌తో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటు మలినేని గోపీచంద్ – బాలయ్య సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. ఒకటి, రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా కూడా ఓకే అయ్యింది. ఇటు అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్ అయితే బ్లాక్‌బస్టర్ కాదు బ్లాక్‌బస్టర్ అమ్మ మొగుడే అయిపోయింది. అన్‌స్టాపబుల్ షో అనేది బాలయ్యలోని కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేసింది.
ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు, హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి కొత్త కోణంలో ఎన్నో తెలియని విషయాలు బాలయ్య రాబడుతున్నాడు. మోహన్‌బాబు, నాని, సుకుమార్, బన్నీ, మహేష్‌బాబు, బోయపాటి, మలినేని గోపీచంద్, రవితేజ ఇలా ఎంతో మందిని బాలయ్య తనదైన స్టైల్లో ప్రశ్నలు వేసి ఆసక్తికర ఆన్సర్లు రాబట్టాడు. అన్‌స్టాపబుల్ షోకు రాకముందు బాలయ్యకు కోపం ఎక్కువ అని.. అందరిని ఊరుకునే తిడతాడు అన్న ప్రచారమే ఎక్కువుగా ఉండేది.
అయితే అన్‌స్టాపబుల్ షో చూసిన వారు అందరూ అసలు బాలయ్యను చూశారు ? బాలయ్యలో తెలియని సరికొత్త కోణం ఈ షో ఆవిష్కరింపజేసింది. ఇంకా చెప్పాలంటే బాలయ్యకు ఇప్పుడు సోషల్ మీడియాలో పాజిటివిటి మోత మోగిపోతోంది. బాలయ్యకు బయట కోపం ఎక్కువ అన్న టాక్ ఉంది. అయితే బాలయ్య కోపం తగ్గించుకోవడానికి ఐదు టిప్స్ చెప్పారు. ఈ ఐదు టిప్స్ పాటిస్తే కోపం సింపుల్‌గా తగ్గించుకోవచ్చనే ఆయన చెపుతున్నారు. మరి కోపం తగ్గించుకోవడానికి బాలయ్య చెప్పిన టిప్స్ ఇవే.
1- మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి.. ఓ మాట తూలడానికి ముందే అది కరెక్టో కాదు ఆలోచించుకున్నాకే బయటకు వదలాలి.
2- రెండోది కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టుకోవాలి.
3- మూడోది ఎంత కోపం వచ్చినా అరుపులు, కేకలు వేయకుండా అసలు సమస్య ఏంటో ఆలించుకోవాలి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
4- నాలుగు మనసులో ఏదీ పెట్టుకోకుండా .. అది బయట పెట్టేసుకోవాలి.. మన తప్పుంటే క్షమించమని అడగాలి.
5- అన్ననింటికన్నా ముఖ్యమైంది తన కోపమే తనకు శత్రువు. ఎంత ఎక్కువ కోపం వస్తే మిగిలిన వాళ్ల సాయం అంత తీసుకోవాలి.. ఎక్కడా కోపం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండాలని తనదైన స్టైల్లో చిట్కాలు చెప్పాడు బాలయ్య.