సినిమా రంగంలో కొన్ని పాత్రల విషయంలో చాలా గమ్మత్తు ఉంటుంది. చిత్ర, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక నటుడికి భార్యగా కనిపించిన హీరోయిన్.. మరో సినిమాలో అతడికి వదినగానో.. లేదా మరో పాత్రలోనో కనిపించాల్సి రావొచ్చు. అంతెందుకు ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవే ఆ తర్వాత ఆయనతో హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో జోడీ కట్టింది. ఉదాహరణకు సంక్రాంతి సినిమాయే తీసుకుంటే ఆ సినిమాలో శ్రీకాంత్‌కు వదినగా కనిపించిన స్నేహ ఆ తర్వాత రాధాగోపాళం సినిమాలో శ్రీకాంత్‌కు భార్యగా కనిపించింది. ఇక ప్రకాష్‌రాజ్ – జయసుధ చాలా సినిమాల్లో భార్య, భర్తలుగా కనిపించారు.
పరుగు, సోలో సినిమాల్లో అక్కా తమ్ముడు, అన్నా – చెల్లి అన్నట్టుగా కనిపించారు. బద్రి సినిమాలో ప్రకాష్‌రాజ్‌కు బావగారిగా కనిపించిన ప్రకాష్‌రాజ్ జల్సా సినిమాలో మామగారిగా కనిపించాడు. ఇది ప్రతి సినిమాకు మారుతూ ఉంటుంది. అయితే విడ్డూరంగా ఒకే హీరోయిన్.. ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు తరాల హీరోల పక్కన రొమాన్స్ చేయడం విచిత్రమే.. ఇది ఇప్పటి నుంచే కాదు.. పాత తరం నుంచే ఉంది. అలా రెండు తరాలకు చెందిన హీరోలతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.
1- శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నార్‌కు జోడీగా ఎన్నో సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత అదే శ్రీదేవి ఏఎన్నార్ తనయుడు నాగార్జునతో అఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లో నటించింది. ఇక బాలయ్య పక్కన కూడా ఓ సినిమాకు శ్రీదేవి పేరును అనుకున్నారు. అయితే తండ్రితో నటించిన శ్రీదేవితో నటించేందుకు బాలయ్య ఒప్పుకోలేదు.
2- కాజల్ :
మగధీర – నాయక్ – గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చెర్రీకి జోడీగా నటించిన కాజల్ చెర్రీ తండ్రి.. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించింది. ఇక తాజాగా రాబోతోన్న ఆచార్య సినిమాలోనూ ఆమె చిరుకు జోడీగా కనిపించబోతోంది.
3 – నయనతార :
ముదురు ముద్దుగుమ్మ నయనతార లక్ష్మీ, తులసి, బాబు బంగారం సినిమాల్లో విక్టరీ వెంకటేష్‌కు జోడీగా కనిపించింది. ఈ సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత నయన్ వెంకీకి కొడుకు అయ్యే రానా పక్కన కృష్ణంవందే జగద్గురం సినిమాలో నటించింది.
4 – భూమిక :
అక్కినేని మనవడు సుమంత్ పక్కన యువకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక స్నేహమంటే ఇదేరా సినిమాలో నాగార్జునకు జోడీగా కనిపించింది. ఈ సినిమాలో సుమంత్ కూడా నటించాడు.
5 – లావణ్య త్రిపాఠి :
ఈ తరం జనరేషన్లో లావణ్య త్రిపాఠి అటు తండ్రి నాగార్జునతో పాటు కొడుకు నాగచైతన్య పక్కన కూడా నటించింది. నాగ్‌కు జోడీగా సోగ్గాడే చిన్ని నాయన సినిమా చేసిన లావణ్య చైతు సరసన యుద్ధం శరణం చేసింది.
6- రకుల్‌ప్రీత్‌సింగ్ :
రకుల్‌ప్రీత్ కూడా అక్కినేని తండ్రి, కొడుకులతో ఘాటు రొమాన్స్ చేసింది. ముందు చైతుకు జోడీగా రారండోయ్ వేడుక చూద్దాం చేస్తే.. తర్వాత నాగార్జునకు జోడీగా మన్మథుడు 2 సినిమా చేసింది.
7- తమన్నా :
రచ్చలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పక్కన చేసిన ఈ మిల్కీబ్యూటీ … తర్వాత బాబాయ్ పవన్ పక్కన కెమేరామెన్ గంగతో రాంబాబు చేసింది. ఇప్పుడు చిరు పక్కన సైరాతో పాటు భోళాశంకర్ కూడా చేస్తోంది.
8- సదా :
ఎన్టీఆర్‌తో డీకే సురేష్ డైరెక్షన్‌లో నాగ సినిమాలో నటించిన సదా ఆ తర్వాత బాలయ్య పక్కన వీరభద్ర సినిమా చేసింది.
9- ఆర్తీ అగర్వాల్:
ఎన్టీఆర్ పక్కన అల్లరి రాముడు చేసిన ఆర్తీ అగర్వాల్ బాలయ్య పక్కన పలనాటి బ్రహ్మనాయుడు చేసింది.
10- త్రిష :
దమ్ములో ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన త్రిష.. లయన్‌లో బాలయ్య పక్కన రొమాన్స్ చేసింది.
11- శృతీహాసన్ :
రామ్‌చరణ్‌తో ఎవడు సినిమా చేసిన శృతీ ఇప్పుడు మెగాస్టార్ సరసన బాబీ డైరెక్షన్‌లో వస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా చేస్తోంది.
12- ప్రియమణి :
సుమంత్ పక్కన రాజ్ సినిమాలో అందాలు ఆరబోసిన ప్రియమణి.. నాగార్జునతో రగడ సినిమాలో అందాల రగడ చేసింది.
13- జెనీలియా:
వెంకటేష్‌తో సుభాష్ చంద్రబోస్ సినిమా చేసిన జెనీలియా.. రానా పక్కన నా ఇష్టం సినిమా చేసింది.
14- శ్రీయ:
బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలు చేసిన శ్రీయ.. ఎన్టీఆర్‌తో నా అల్లుడు సినిమా చేసింది.
15- అనుష్క:
నాగార్జునతో చాలా సినిమాలు చేసింది అనుష్క. డాన్ – ఢమరుకం – రగడ చేసింది. సుమంత్‌తో మహానంది సినిమా చేసింది.
16- సమంత :
చరణ్‌తో రంగస్థలం, పవన్‌తో అత్తారింటికి దారేది చేసింది సమంత. ఈ రెండూ ఇండస్ట్రీ హిట్లే.
17- వేదిక:
కళ్యాణ్‌రామ్‌తో విజయదశమి, బాలయ్యతో రూలర్ సినిమాలు చేసింది.
18- సోనాల్ చౌహాన్ :
బాలయ్యతో లెజెండ్ – రూలర్ – డిక్టేటర్, కళ్యాణ్‌రామ్‌తో షేర్ సినిమాలు చేసింది.
19- తాప్సీ:
షాడోలో వెంకీ.. ఘాజీలో రానా పక్కన నటించింది.
20- ఇలియానా:
జల్సాలో పవన్.. జులాయిలో బన్నీతో నటించింది