మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు టాలీవుడ్లో తనకంటూ సపరేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రంగస్థలం సినిమా తర్వాత చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయవిధేయ రామ మాత్రం ప్రేక్షకులను కాస్త డిజప్పాయింట్ చేసింది. ఆ తర్వాత మూడున్నరేళ్ల పాటు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా చేస్తూనే ఉన్నాడు. మార్చిలో త్రిబుల్ ఆర్తో చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. ఏప్రిల్ చివర్లో తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
ఇక చరన్ తన కెరీర్లో 10 సినిమాలు వదులుకున్నాడు. ఆ వదులుకున్న సినిమాలు ఏంటి .. వాటి ఫలితాలు ఏంటో చూద్దాం.
1- సూర్య సన్నాఫ్ కృష్ణన్ :
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఇదో క్లాసిక్ మూవీ. ఈ సినిమాలో పాటలు ఇప్పటకీ మనలను అలరిస్తూనే ఉంటాయి. ఈ సినిమా టేకింగ్ అద్భుతం. కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా చేసి ఉంటే చరణ్‌కు మంచి పేరు వచ్చేది. మగధీరతో బిజీగా ఉండడంతో చరణ్ ఈ సినిమా వదులుకున్నాడు.
2- లీడర్ :
శేఖర్ కమ్ముల ఈ కథ ముందుగా చరన్కే చెప్పాడు. తన ఇమేజ్‌కు సూట్ కాదని వదులుకున్నాడు. ఆ తర్వాత ఈ కథ బన్నీ దగ్గరకు కూడా వెళ్లింది. చివరకు సురేష్ ప్రొడక్షన్ వారు కథ ఓకే చేసి.. రానాతో చేశారు.
3- డార్లింగ్ :
ప్రభాస్‌కు ఇది ఓ రకంగా కం బ్యాక్ మూవీ లాంటిది. ఈ కథ ముందుగా దర్శకుడు చరణ్‌కే వినిపించాడు. అయితే చరణే ఈ కథతో ప్రభాస్‌తో సినిమా చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో చివరకు డార్లింగ్‌లో ప్రభాస్ నటించాడు.
4 – ఎటో వెళ్లిపోయింది మనసు :
ఈ కథను కూడా దర్శకుడు గౌతమ్ మీనన్ ముందుగా చరన్కే చెప్పాడు. ఈ కథ కూడా చరన్‌కు నచ్చలేదు. అలా రెండోసారి గౌతమ్ కథను చరన్ రిజెక్ట్ చేశాడు. తర్వాత ఈ కథను రామ్ ఓకే చేశాడు. ఆ తర్వాత రామ్ కూడా తప్పుకోవడంతో చివరకు నాని ఈ సినిమా చేశాడు.
5- కృష్ణంవందే జగద్గురుం :
ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ముందు ఈ కథ వెంకటేష్‌కు చెప్పాడు క్రిష్. ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ తర్వాత క్రిష్ చరణ్‌ను సంప్రదించాడు. చరణ్‌కు కథ ఎందుకో కాని ఎక్కలేదు. చివరకు రానా ఫైనల్ అయ్యాడు.
6- శ్రీమంతుడు:
చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ ముగ్గురికి కూడా శ్రీమంతుడు కథ చెప్పాడు కొరటాల. అయితే ఈ కథలో సోషల్ మెసేజ్ ఎక్కువుగా ఉండడంతో రిస్క్ అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫైనల్‌గా ఇది మహేష్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు.
7- మనం :
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అక్కినేని ఫ్యామిలీ క్లాసిక్ మూవీ ఇది. ముందు ఈ సినిమాను చరణ్‌తో పాటు చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది. చివరకు ఇది అక్కినేని ఫ్యామిలీ కోసమే రాసి పెట్టినట్టుగా అక్కడకు వెళ్లి సూపర్ హిట్ కొట్టింది.
8 – కృష్ణార్జున యుద్ధం:
నాని డబుల్ రోల్ చేసిన ఈ సినిమా కథను దర్శకుడు మేర్లపాక గాంధీ ముందుగా చరన్‌కు వినిపించాడు. అయితే చరన్ రిజెక్ట్ చేయడంతో చివరకు నాని చేశాడు. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా నానికి మంచి పేరు తీసుకువచ్చింది.
9- నేల టిక్కెట్ :
కురసాల కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథను ముందుగా చరణ్‌కే చెప్పారట. అయితే కథ నచ్చక చరణ్ రిజెక్ట్ చేశాడు. చివరకు రవితేజ చేస్తే ప్లాప్ అయ్యింది.
10- ఓకే బంగారం:
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కూడా చరణ్ రిజెక్ట్ చేశాడు. ఇంత క్లాసిక్ మూవీలో తాను నటించలేనని చెప్పేశాడట.