MoviesRRR: సినిమాలో తారక్ ఎంట్రీ..గూస్ బంప్స్ పక్కా..!!

RRR: సినిమాలో తారక్ ఎంట్రీ..గూస్ బంప్స్ పక్కా..!!

ఫైనల్లీ..సినీ లవర్స్ ఆశ నెరవేరిన రోజు ఇది. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఆర్​ఆర్​ఆర్​’ మూవీ కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఫస్ట్ షో తోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. టికెట్లు దొరికిన అభిమానులు.. థియేటర్లలో సందడి చేస్తుంటే..తరువాతి షో కైనా టికెట్లు దొరుకుతాయని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జూనియర్ ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​లు హీరోలుగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ టీజర్, ట్రైలర్ , పాటలు.. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. అయితే అభిమానులు పెట్టుకున్న అంచనాలను జక్కన్న ఏ మాత్రం తగ్గనీకుండా సినిమా ని ఓ రేంజ్ లో నిలబెట్టాడు. హీరోయిన్స్ కి పెద్ద స్కోఫ్ లేని ఈ సినిమాలో ఆలియా భట్​ హీరోయిన్​గా నటించగా..ఆమె తన అమాయకపు నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ఇక గెస్ట్ రోల్ లో మెరిసిన అజయ్​ దేవ్​గన్​ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు.

1918-20 మధ్యలో తెలంగాణా పోరాట యోధుడు కొమరం భీమ్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఇద్దరూ రెండు కూడా సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతారు. సీన్ కట్ చేస్తే..అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు.. ఎటు వెళ్ళరన్నది మెయిన్ పాయింట్.. జక్కన్న మార్క్ చూయిస్తూ.. మళ్లీ రెండేళ్ల తరువాత ఇద్దరూ కూడా విప్లవ కణంలా ప్రత్యక్షమవుతారు. అప్పుడు ధియేటర్స్ లో అరుపులు వింటే ఫుల్ మజా వస్తుంది. తెర పై ఆ సీన్స్ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..సీట్లలో అభిమానుల అరుపులు..సినిమా హిట్ అని చెప్పడానికి ఇది చాలు. ఈ సినిమాలో కోమరం భీం పాత్ర పులి తో చేసే ఫైట్ తో ఎంట్రీ అవుతాడు తారక్ . తారక్ మరియు పులి మధ్య ఫైట్ చాలా భీకరంగా ఉన్నాయి.

సినిమా కధ తెలిసినదే అయినా ఊహించని ట్వీస్ట్లు ఇచ్చాడు జక్కన్న. తారక్ – చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ బిల్డ్ చేసిన విధానం, కథానాయికలతో వీరిద్దరి ట్రాక్స్ ఒక టెంపోలో సాగిపోతాయి. కొమరం భీమ్ నిజాం పాలకుల పైన.. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులపైన చేసే పోరాట సన్నివేశాలు ధియేటర్ కి వచ్చిన అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ పోరాటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఇద్దరూ కనిపించకుండాపోయిన సమయంలో వారు ఇద్దరూ కలిసి.. పోరాటానికి దిగితే ఎలా ఉండేది? వారిద్దరూ కలిసి యుద్ధం అంటూ చేస్తే పరిస్థితులు ఎలా మారాయన్నది అసలు RRR కధ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా టూ గుడ్..ఓ విజువల్ వండర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news