ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్‌కు 42 ఏళ్లు వచ్చేశాయి. ప్రభాస్ కన్నా చిన్నోళ్లు అయిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రులు అయ్యారు. రామ్‌చరణ్, రానాకు పిల్లలు లేకపోయినా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లంతా 35 + లో ఉన్నోళ్లు.. మరి ప్రభాస్‌కు ఇప్పటికే 42 ఏళ్లు వచ్చేశాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్‌ను క్లీయర్‌గా చూస్తే బుగ్గలు వచ్చేసి వయస్సు పైబడిన చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే బాహుబలి కోసం నాలుగేళ్లు.. సాహో కోసం మూడేళ్లు.. ఇప్పుడు కరోనా పుణ్యమా అని రాధేశ్యామ్ కోసం మరో మూడేళ్లు వేస్ట్ చేసేశాడు. ఒక్కో సినిమాకు 2-3 ఏళ్లు కేటాయిస్తున్నాడు. దీంతో పదేళ్ల కాలం ఉఫ్‌మని వెనక్కు వెళ్లిపోయింది. ప్రభాస్ వెనక్కు తిరిగి చూసుకుంటే బాహుబలి సినిమాతో గొప్ప స్టారే అయ్యాడు.. పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. కానీ విలువైన పదేళ్ల కాలం వ్యక్తిగతంగా కోల్పోయాడు.
పైగా ప్రభాస్ హీరో మాత్రమే కాదు.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు వారసుడు. ఆయన సినీ వారసత్వాన్ని ఘనంగా కంటిన్యూ చేస్తున్నాడు. రేపటి రోజున ప్రభాస్ కూడా ఓ పిల్లోడ్ని కంటే ఆయనకు ఓ వారసుడు ఉంటాడు.. రేపటి రోజు ఆయన సినీ వారసత్వానికి అసలు సిసలు హీరో కావచ్చు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా అదే కోరుకుంటున్నాడు. రాధేశ్యామ్ ప్రమోషన్లలో ఆయన చెప్పిన మాటలు చూస్తే ప్రభాస్ పెళ్లి విషయంలో ఏ మాత్రం ఇష్టంగా లేడన్నది ఆయన నిర్వేదాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు. ఈ యేడాది పెళ్లి అని చాలాసార్లు చెపుతూనే వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ మాటలు ఆరేడేళ్లుగా చెపుతూనే వస్తున్నాడు. కృష్ణంరాజు చెపుతున్న ఈ మాటలు చూస్తేనే ప్రభాస్ పెళ్లి కృష్ణంరాజు చేతుల్లో లేదని.. అసలు కృష్ణంరాజు చెప్పిన మాటను పెళ్లి విషయంలో ప్రభాస్ లైట్ తీస్కొంటున్నాడని క్లారిటీ వచ్చేసింది.
తాజాగా మరోసారి కూడా ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు రియాక్ట్ అయ్యాడు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కంటే తాను సరదాగా ఎత్తుకుని ఆడించాలని కోరుకుంటున్నానని.. ఆయన ఆశతో.. ఇంకా చెప్పాలంటే ఆవేదనతో వేడుకుంటున్నట్టే ఆయన మాటలు చెపుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాలు ఆదిపురుష్, సలార్ 1, 2, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమా.. ఆ తర్వాత మళ్లీ రాజమౌళితో సినిమా ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ పెళ్లి మూడ్‌లో ఉన్నట్టే కనపడడం లేదు.
అసలు ప్రభాస్‌కు పెళ్లి ఇష్టంలేదనే వాళ్లు కూడా లేకపోలేదు. అయితే ఓ వాదన మాత్రం ఉంది. ప్రభాస్ – అనుష్క రిలేషన్‌పై ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. అనుష్క కూడా ఇప్పటకీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. ఏదేనా వీరిద్దరి మధ్య ప్రేమ ఉండి ఉంటే వీరిద్దరే పెళ్లి చేసుకోవాలి.. లేనిపక్షంలో ప్రభాస్ ఈ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకు ఈజీగా మరో రెండున్నర.. మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత ప్రభాస్ మనసు మళ్లీ ఎలా మారుతుందో చెప్పలేం.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఆ దేవుడికే తెలియాలి.