హీరో రామ్ పోతినేని..చూడటానికి చక్కగా ఉంటాదు.. నవ్వుతూ పలకరిస్తాడు.. నటన పరంగా కూడా బాగా ఆకట్టుకుంటాడు..ముఖ్యంగా ఇతరులు విషయాల్లో అస్సలు పట్టించుకోడు..తన పని తాను చూసుకుంటు వెళ్ళిపోతాడు.. అందుకే ఆయన స్టార్ హీరో కాకపోయినా..మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా అని తన జోలికి వస్తే చూస్తూ కూర్చోడండోయ్ ..ఇచ్చిపడేస్తాడు. స్రవంతి రవి కిషోర్ తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన..మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా కష్టాలు పడ్డాడు.
ఆ తరువాత పడుతూ లేస్తూ..ఎలాగోలా ఫాంలోకి వచ్చాడు. ఆ తరువాత ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. 2006 లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు మూవీ తో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత నిన్నమొన్నటి రెడ్ మూవీ వరకు రామ్ కెరీర్ లో ప్లాప్ లు ఉన్నాయి.. హిట్స్ ఉన్నాయి. కానీ చాలా వరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలే ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా ఆయన నటనలో మాత్రం వేలు పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు. అంత బాగా నటించాడు. రామ్ నటించిన రెడీ, నేను శైలజ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ లా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫైనల్ గా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన మాస్ క్యారెక్టర్.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ అవతారమెత్తాడు. ఇస్మార్ట్ హిట్ తో మాస్ ఫాన్స్ మనసులు దోచేశాడు.
ప్రజెంట్ ఈయన కోలీవుడ్ స్టార్ హీరో లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ పక్కన హీరోయిన్ గా లెటేస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి నటిస్తుంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రామ్ మతిమరుపు ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. స్టోరీ పరంగా హీరో రామ్ కు మతిమరపు ఉండటం..ఓ కేసు విషయంలో సాక్ష్యలు తారుమారు అవ్వడం..ఫైనల్ గా ఆయన ఆ కేసు ని ఎలా సాల్వ్ చేసి తన అమ్మకిచ్చిన మాట కోసం పోలీస్ ఉద్యోగాని పోగొట్టుకోకుండా చేసుకున్నాడు అనేది అసలు కధ అంటా.
మతిమరుపు వల్ల రామ్‌కి వచ్చిన సమస్య ఏంటి? దాన్నెలా సరిదిద్దుకున్నాడు..దానికోసం కృతి ఏం చేసింది.. నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండనుందట. అయితే ఈ సినిమాలో మనం ఎప్పుడు చూడని కృతిని చూడబోతున్నాం అంటున్నారు మేకర్స్. ఆమె క్యారెక్టర్ మనం అస్సలు గెస్ చేయలేని విధంగా ఉండబోతుందట. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతుంది. మరి చూడాలి ఈ సినిమా రామ్ కి ఎలాంటి పేరు తీసుకువస్తుందో..?