పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి దిగనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. మూడో రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్లలోకి దిగిపోనుంది. రిలీజ్‌కు టైం కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో దూసుకు పోతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి ముగ్గురూ కూడా కలిసి నార్త్ నుంచి సౌత్ వరకు ప్రమోషన్లు హోరెత్తించేస్తున్నారు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరు విప్లవ యోధులు అయినా కూడా ఫిక్షన్ కథతోనే ఈ సినిమాను రూపొందించినట్టు దర్శకుడు రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మెజార్టీ థియేటర్లలో త్రిబుల్ ఆర్ సందడి చేయనుంది. ఒక్క ఓవర్సీస్‌లోనే ఈ సినిమా 1100 స్క్రీన్లలో రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు పోటెత్తుతున్నారు. మామూలు సినిమా రిలీజ్ అయితేనే అభిమానులు థియేటర్లలో చేసే రచ్చ మమామూలుగా ఉండదు. ఇక త్రిబుల్ ఆర్‌లో ఏకంగా ఇద్దరు క్రేజీ స్టార్స్ ఉన్నారు. పైగా రాజమౌళి దర్శకుడు.. దీంతో ప్రేక్షకులు థియేటర్ల దగ్గర తోసుకురావడం.. నానా రచ్చ చేయడం చేస్తారు. దీంతో థియేటర్లకు డ్యామేజ్ కూడా జరిగే ఛాన్సులు ఉంటాయి.
అందుకే థియేటర్ల ఓనర్లు ముందుగా ఈ ప్రమాదం పసిగట్టేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ పవర్ ఫుల్ డైలాగులు చెప్పినప్పుడు వీళ్లు తెరముందుకు వెళ్లి రచ్చ చేస్తారు. అలాగే కాగితాలు, పూలు విసరడంతో పాటు అవి కింద పడితే వాటినే తీసి మళ్లీ మళ్లీ విసురుతూ ఉంటారు. అందుకే ముందు స్క్రీన్‌కు, సీట్లకు మధ్యలో ఇనుప కంచెలు వేయడంతో పాటు మేకులు అమర్చారు. ఎవ్వరూ కూడా స్క్రీన్ ముందుకు వెళ్లకుండా థియేటర్ల ఓనర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో బయ్యర్లు తాము ఎప్పుడో అడ్వాన్స్‌లు ఇచ్చామని.. ఇప్పుడు వడ్డీల భారం ఎక్కువ అయ్యిందని.. ముందుగా అనుకున్న దానికంటే 30 % తగ్గించాలని నిర్మాత దానయ్యను కోరుతున్నారు. దానయ్య మాత్రం 10 % తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్ ?