తెలుగు సినిమా పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం ఉదయ్‌కిరణ్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. 2000 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ హీరోగా వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్‌కిరణ్‌కు ఆ సినిమా హిట్ అవ్వడంతో యూత్‌లో కింగ్ అయిపోయాడు. ఈ సినిమాతోనే రిమాసేన్ హీరోయిన్‌గా, తేజ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఉదయ్, రిమాసేన్, తేజ, ఆర్పీ పట్నాయక్ లాంటి వాళ్ల కెరీర్‌కు మంచి పునాది వేసింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో కొన్నేళ్ల పాటు వీరు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇక తేజ ఎప్పుడూ ఏ విషయంలో అయినా నిర్మొహమాటంగా ఓపెన్‌గానే మాట్లాడేస్తూ ఉంటాడు. ఇక ఉదయ్‌కిరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. అయితే తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన తేజనే తన గురువుగా భావించేవాడు. చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి నువ్వు నేను సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఉదయ్‌కిరణ్, తేజ ఇద్దరూ కష్టాల్లో ఉన్నప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చినా అది చిత్రం, నువ్వునేనులా మ్యాజిక్ చేయలేకపోయింది.
అయితే నువ్వు నేను సినిమా తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్న ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఆ టైంలో వీరు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. నితిన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తేజ జయం సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో సదా హీరోయిన్‌గా నటించింది. అదే టైంలో ఉదయ్ కిరణ్ హీరోగా విఎన్. ఆదిత్య దర్శకత్వంలో శ్రీరామ్ సినిమా తెరకెక్కింది. రెండు ఒకేసారి రావడంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ వచ్చింది. అసలు రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. తేజ, ఉదయ్ కిరణ్ కావాలనే తమ సినిమాల విషయంలో పంతానికి పోతున్నారన్న ప్రచారమూ గట్టిగా జరిగింది.
చివరకు జయం ఓ వారం రోజుల ముందుగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీరామ్‌కు యావరేజ్ టాక్ వచ్చింది. జయం 1.62 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రు. 25 కోట్లకు పైనే కొల్లగొట్టింది. ఇక శ్రీరామ్ సినిమాలో ఓ కమెడియన్ పాత్రకు తేజ అనే పేరు పెట్టారు. ఈ పాత్ర ఎప్పుడూ ఇతరులతో తిట్లు తింటూ ఉంటుంది. తేజ మీద కోపంతోనే ఉదయ్ కిరణ్ కావాలనే ఈ పాత్ర క్రియేట్ చేయించి.. అలా తిట్టించాడని ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు సినిమాల పోరులో తేజ జయందే పై చేయి అయ్యింది.
అయితే తర్వాత కొద్ది రోజులు ఉదయ్ కిరణ్ – తేజ మధ్య మాటలు కూడా లేవు. అయితే వీరిద్దరు వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు మరోసారి కలిసి పనిచేసినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.