విక్టరీ వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో `నువ్వు నాకు నచ్చావ్` కూడా ఒకటి. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తీ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, శ్రీ స్రవంతి రవికిశోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా పని చేయగా.. కోటి స్వరాలు అందించారు. 2001 సెప్టెంబరు 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
వెంకీ – ఆర్తీ అగర్వాల్‌ల మధ్య కెమిస్ట్రీ, కోటి అందించిన సంగీతం, విజయ భాస్కర్ టేకింగ్, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సునీల్ కామెడీ కూడా అప్పట్లో పిచ్చ పిచ్చగా హైలెట్ అయ్యింది. దీంతో ఈ చిత్రం అప్పట్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.18.04 కోట్ల షేర్ వసూల్ చేసి నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది. అలాగే దేవి పుత్రుడు, ప్రేమతో రా వంటి వరుస ప్లాప్ లతో సతమతం అమవుతున్న వెంకటేష్ ఈ సినిమాతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ వెంకటేష్ కాదు.
బాలనటుడిగా తెరపై మ్యాజిక్ చేసిన తరుణ్.. కె. విజయ భాస్కర్ తెరకెక్కించిన `నువ్వే కావాలి`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నువ్వే కావాలి అప్పట్లో చాలా కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడింది. ఇది ఓ సంచలన విజయం. ఈ సినిమాలో తరుణ్ – రీచా జంటగా నటించారు. సాయికిరణ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు తరుణ్ బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే విజయ భాస్కర్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన `నువ్వు నాకు నచ్చావ్`లోనూ తరుణ్‌నే హీరోగా తీసుకోవాలని భావించగా.. ఆయన మాత్రం ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత వెంకటేష్‌ను హీరోగా తీసుకుని సినిమాను విడుదల చేయగా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత అనవసరంగా మంచి సినిమాను వదులుకున్నందుకు గానూ తరుణ్ కాస్త బాధపడ్డాడట.
ఆ రోజుల్లోనే నువ్వు నాకు నచ్చావ్ 57 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.