దాదాపు మూడు దశాబ్దాల క్రితం తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా సుందరకాండ సినిమా వచ్చింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ రీమేక్ సినిమా అప్పట్లో సూపర్ హిట్. వెంకీ – మీనా జంటగా నటించిన ఈ సినిమాలో లెక్చరర్ వెంకటేష్‌ను ప్రేమించే ఓ అల్లరి పిల్ల కూడా ఉంటుంది. ఆమె ఎవరో కాదు అపర్ణ. ఒక్క సినిమాతోనే ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అసలు అపర్ణ ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఎలా ? ఛాన్స్ వచ్చిందో తెలుసుకుంటేనే విచిత్రం అనిపిస్తుంది.
ఈ పాత్ర కోసం రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ పాత్రకు ఆమె అంతగా సూట్ కాకపోవడంతో ఓ కొత్త అమ్మాయి బాగుంటుందని.. కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ రోజు నిర్మాత కెవివి. సత్యనారాయణ గారింటికి వెళ్లారు రాఘవేంద్రరావు. అక్కడ ఉన్న ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చేసింది. తన స్టూడెంట్ పాత్రకు ఆమె అయితేనే సూట్ అవుతుందని కూడా అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరో ? పైగా నిర్మాత ఇంట్లో ఉంది ? ఆమె సినిమాల్లో నటిస్తుందో ? లేదో ? కదా ? అనుకుని ఆయన మౌనంగా ఉన్నారు.
పది రోజుల తర్వాత ఆ పాత్ర కోసం ఆయన అడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్ కోసం అపర్ణ కూడా వచ్చింది. ఇంకేముందు వెంటనే ఆమెను చూసిన రాఘవేంద్రరావు సెలక్ట్ చేసేశారు. నువ్వు ఎవరు అమ్మాయి ? అని ఆయన అడిగితే.. సార్ నా పేరు అపర్ణ. నేను నిర్మాత కెవివి. సత్యనారాయణ గారి మేనకోడలిని అని చెప్పిందట అపర్ణ. వెంటనే అసిస్టెంట్‌తో ఆమెను ఓకే చేసేయండని చెప్పేశారట రాఘవేంద్రరావు. అసలే ఆమెకు యాక్టింగ్ కొత్త కావడంతో ఆమె ఎలా నటిస్తుందో ? అని రాఘవేంద్రుడు బాగా టెన్షన్ పడ్డారట.
అయితే లెక్చరర్‌ను ప్రేమించే పాత్రలో ఆమె అద్భుతంగా నటించి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. అయితే వాళ్ల కుటుంబం ఒప్పుకోలేదు. అయితే దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్కపెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో మాత్రం ఆమె నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై 2002లో పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసింది.
ఇక ఈ సినిమాలో లెక్చరర్‌ను ప్రేమించే పాత్రలో అపర్ణ సెట్ కాదనే చాలా మంది అనుకున్నారట. ఈ విషయాన్ని వెంకటేష్ కూడా చెప్పడంతో ఆయన మాత్రం కథ మీద నమ్మకంతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావుపై ఉన్న నమ్మకంతో నో చెప్పలేదు. చివరకు సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.