నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చేశాడు. అఖండ తాజాగా నాలుగు సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకుకోగా… ఈ నాలుగు సెంటర్లలో కూడా ఆంధ్రాలోనే ఉన్నాయి. అందులో మూడు సెంటర్లు ఒక కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. తాజాగా అఖండ 100 రోజుల ఫంక్షన్ కర్నూలులో చాలా వైభవంగా జరిగింది. ఇక బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అఖండ సినిమాలో లుక్ పరంగా బాలయ్యకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అఘోరా పాత్రలో బాలయ్య అలా ఒదిగిపోయాడు. ఆ పాత్రను దర్శకుడు బోయపాటి శ్రీను మలిచిన తీరుతో పాటు బాలయ్య హావభావాలు.. అహం ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ పాత్రకు తగినట్టుగా హీరో లుక్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే బాలయ్య నటించిన ఒక సినిమా కేవలం లుక్ సరిగా లేకపోవటం వల్లే ప్లాప్ అయ్యింది. ఈ విషయాన్ని సదరు సినిమా నిర్మాత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలయ్య నటించిన రూలర్ సినిమా ప్లాపు కావటానికి బాలయ్య విగ్ కూడా ఒక కారణం అని కళ్యాణ్ స్వయంగా చెప్పారు. బాలయ్యతో 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన జైసింహా సినిమా రూపొందించిన కేఎస్. రవికుమార్ రూలర్ కూడా తెరకెక్కించారు. ఇక సీ కళ్యాణ్ – బాలయ్య కాంబినేషన్లో పరమవీరచక్ర – జైసింహ – రూలర్ సినిమాలు వచ్చాయి. దాసరి దర్శకత్వంలో తెరకెక్కి… భారీ అంచనాలు ఏర్పడడంతో పరమవీరచక్ర ప్లాప్ అయిందని అన్నారు. జైసింహ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది అని.. రూలర్ మాత్రం కొంతమేర నష్టాలను మిగిల్చింది కళ్యాణ్ చెప్పారు.
కేవలం విగ్ వల్లే బాలయ్య రూలర్ సినిమాలో ఆ పాత్ర సరిగా కనిపించలేదని కళ్యాణ్ చెప్పారు. రూలర్ సినిమా రిలీజ్ అయిన టైంలో బాలయ్య విగ్‌కు సంబంధించి కూడా ట్రోల్స్ వచ్చాయి, రూలర్ సినిమాలో బాలయ్య ఐటీ కంపెనీ సీఈఓగా అదరగొట్టినా.. పోలీస్ అధికారి ధర్మ పాత్ర కోసం వాడిన విగ్ మాత్రం సినిమాకు మైనస్ అయింది. 2019 డిసెంబర్ లో వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు 10 కోట్ల షేర్ కూడా రాబట్ట లేదు.