దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ RRR. ఈ సినిమా థియేటర్లలోకి దిగేందుకు మరో మూడు రోజుల టైం మాత్రమే ఉంది. టాలీవుడ్లోనే తిరుగులేని యంగ్ స్టర్స్‌గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఈ నెల 25న థియేటర్లలోకి దిగుతోంది. బాహుబలి ది కంక్లూజ్ లాంటి వెండితెర సంచలనం తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజమౌళి & టీం దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.
సినిమా స్టిల్స్, విజువల్స్ చూస్తుంటేనే కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయ్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకుల మతులు పోగొట్టేలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ ఇద్దరూ కూడా చరిత్రలో ఎంతో పేరున్న విప్లవయోధులే. భారతదేశాన్ని బ్రిటీష్ పాలకుల కబంద హస్తాల నుంచి విడిపించేందుకు పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వారే..! నిజ జీవిత పాత్రల స్ఫూర్తిగా విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా త్రిబుల్ ఆర్ సినిమా వస్తోంది.
ఇందులో ఈ రెండు పాత్రల మధ్య స్నేహాన్ని ప్రధానంగా చూపించనున్నారు. బాహుబలి కంటే త్రిబుల్ ఆర్ పెద్దదని.. ఈ సినిమాలో ఎమోషన్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని దర్శకుడు రాజమౌళి ఇప్పటికే చెప్పారు. నిజానికి రాజమౌళి సినిమాల్లో ఎమోషన్లు ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. ఇక ప్రతి సినిమాలో సినిమాను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకువెళ్లే సీన్లు నాలుగైదు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇదే రాజమౌళి సక్సెస్ ఫార్ములా..!
ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలోనూ అలాంటి సీన్లు ఐదారు వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇవే సినిమాకు ఆయువు పట్టుగా నిలవబోతున్నాయట. ఫస్టాఫ్‌లో వచ్చే రెండు సీన్లు.. సెకండాఫ్‌లో వచ్చే మరో మూడు సీన్లే సినిమా రిజల్ట్ ఏ స్థాయిలో ఉండబోతోందో డిసైడ్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ ఐదు సీన్లు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతాయి.. ఇవి ఎలా పండుతాయనేదానిమీదే ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుందట.
ఇక రిలీజ్ డేట్‌కు మరో మూడు రోజుల టైం మాత్రమే ఉండడంతో ప్రమోషన్లు మాత్రం శరవేగంగా చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఒక్క అమెరికాలోనే దాదాపుగా 1100 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తిరుగులేని సంచలనాలు నమోదు చేసేలా ఉంది.