అబ్బ త్రిబుల్ ఆర్ థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. రేపు సాయంత్రం నుంచే ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ హంగామా స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికక్కడ షోలు ఎప్పుడు పడతాయా ? అని ప్రేక్షకులు అందరూ థియేటర్ల దగ్గర పడికాపులు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు – గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రల ఆధారంగా పూర్తిగా ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా గానే ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.
ఫక్తు కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఈ సినిమా రూపొందింది. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కోసమే జక్కన్న నెలల తరబడి షూటింగ్ చేయడంతో పాటు నిమిషం సీన్ కోసం రు. 50 లక్షలు ఖర్చు పెట్టిస సీన్లు కూడా ఉన్నాయంటున్నారు. మూడేళ్ల పాటు చెక్కి చెక్కీ ఈ సినిమాను ఓ శిల్పంలా చెక్కాడు. ఓ వైపు త్రిబుల్ ఆర్ విజువల్ వండర్‌గా నిలవడంతో పాటు మరోవైపు యాక్షన్ సన్నివేశాలు పతాకస్థాయిలో ఆవిష్కరించారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ – రామ్‌చరణ్ మేకింగ్ కోసం విదేశీ టెక్నీషియన్లు సైతం ఈ సినిమాకు పనిచేశారు. ఇక ఈ సినిమాలో తారక్ వాడిన ఓల్డ్ బైక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ బైక్ చూడడానికే చాలా వెరైటీగా ఉంది. ఇది ఏ మోడల్ బైక్ ? అన్న చర్చ కూడా సినిమా అభిమానుల్లో, సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే ఈ బైక్‌కు చాలా స్పెషాలిటీ ఉందని తెలుస్తోంది. ఈ బైక్ కోసం రాజమౌళి చాలా అన్వేషణ కొనసాగించాడట.
ఇది 1920 కాలానికి చెందిన బైక్ అట. అప్పట్లో ఇలాంటి బైక్‌లు ఎలా ఉండేవి ? అన్నది రీసెర్చ్ చేసుకున్న తర్వాతే ఈ బైక్‌ను తారక్ పాత్ర కోసం సెట్ చేశారట. బ్రిటన్ కంపెనీ అయిన దీని హెడ్ ఆఫీస్ బర్మింగ్ హోంలో ఉంది. 1920 – 1950 మధ్య కాలంలో మోటార్ రేసింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఈ మోడల్ బైక్ కొనసాగిందట. అప్పట్లో 350 సీసీ, 500 సీసీ బైక్‌లను ఈ కంపెనీ లాంచ్ చేసింది. అయితే 1971లోనే ఈ కంపెనీ తమ ప్రొడక్ట్ ఆపేసింది.
అయితే ఇప్పుడు తారక్ పాత్ర కోసం ఈ బైక్ అవసరమైంది. అందుకే ఇప్పుడు ఆ మోడల్‌తోనే ఈ బైక్‌ను తయారు చేయించాడట రాజమౌళి. ఇందుకోసం రు. 20 లక్షలు ఖర్చు పెట్టారట. మరి ఈ బైక్‌ను త్రిబుల్ ఆర్ గుర్తుకు ఉంచుకుంటారా ? లేదా ? వేలం వేస్తారా ? అన్నది చూడాలి.