తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది తారలు అటు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవటమే కాదు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక తమ భర్తలను కూడా డైరెక్టర్లుగా ప్రొడ్యూసర్లుగా నిలబెట్టేందుకు ఎంతగానో కష్టపడి పోయారు. ఇలా తమ భర్తల కెరియర్ కోసం తమ కెరీర్‌ను త్యాగం చేయడమే కాదు ఇక ఫైనాన్షియల్‌గా కూడా అప్పులపాలైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక ఇలా భర్తల కోసం ఎంతగానో త్యాగం చేసి అప్పులపాలైన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రమ్యకృష్ణ :
రమ్యకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎంత హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఆ తర్వాత దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ సినిమాలో రమ్య నటించింది. ఆ సినిమా టైంలో చిగురించిన స్నేహం కాస్తా ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అప్పట్లో కృష్ణవంశీ సినిమాలంటే తెగ క్రేజ్ ఉండేది. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ప్రభావం తగ్గింది. ఈ క్రమంలోనే భర్త కృష్ణవంశీని దర్శకుడిగా నిలబెట్టేందుకు ఇక ఎంతగానో ఫైనాన్షియల్‌గా కూడా హెల్ప్ చేసారట. ఇక ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చివరికి ఇక మళ్ళీ తన కెరీర్ పైనే దృష్టి పెట్టారు రమ్యకృష్ణ. కృష్ణవంశీకి ఇప్పటకీ సరైన సినిమా దొరకని పరిస్థితి.
జయసుధ :
సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే జయసుధ బాలీవుడ్ ప్రొడ్యూసర్ నితిన్ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాలు చేయడం తగ్గించారు. అయితే ప్రొడ్యూసర్ కావడంతో తన భర్తను స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చేందుకు ఇక ఎన్నో త్యాగాలు చేశారట జయసుధ. కానీ కలిసి రాకపోవడంతో ఆర్థికంగా చాలా నష్టపోయారు. చివరికి మళ్లీ జయసుధ తన కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే జయసుధ భర్త ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
రోజా :
సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రోజా తమిళ దర్శకుడు సెల్వమనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక రోజా సెల్వమణిని స్టార్ డైరెక్టర్ గా మార్చేందుకు ఎంతో కష్టపడ్డారు. కానీ అది కుదరక పోవడంతో చివరికి ఇక తన కెరీర్ పై దృష్టి పెట్టారటట రోజా. ఓవరాల్‌గా చూస్తే భర్తల కోసం ఈ హీరోయిన్లు నానా తిప్పలు పడ్డారు. వాళ్లను నమ్ముకోవడం కన్నా తామే కష్టపడితే బెటర్ అని.. తమ కెరీర్‌ను వదులుకోవడం వేస్ట్ అని వారు ఇప్పుడు కూడా బిజీగా ఉన్నారు.