విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. హీరోయిన్ల విషయంలో ఆయన చాలా కేర్‌గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లు మాత్రమే కాదు.. మహిళలను గౌరవించే విషయంలో ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు అన్న చట్టం తెచ్చి గౌరవించారు. ఇక తన తోటి హీరోయిన్లను ఎన్టీఆర్ ఎంతో గౌరవిస్తారు. అయితే ఎన్టీఆర్ సినిమాల్లో హీరో అయినప్పటికే ఆయనకు మరదలు బసవతారకంతో పెళ్లయిపోయింది.
ఇక స్టార్ హీరోగా ఒకరిద్దరు హీరోయిన్ల విషయంలోనే ఆయన గాసిప్‌లు ఎదుర్కొన్నారే తప్పా పెద్దగా ఆయనకు హీరోయిన్లతో ఏదో ఉందన్న వార్తలు అయితే రాలేదు. సీనియర్ హీరోయిన్ జమున విషయంలో ఆయనపై కొన్ని గాసిప్‌లు వచ్చాయి. అయితే ఈ గాసిప్‌లు ఎందుకు వచ్చాయి ? ఈ కథ ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ జమునతో పలు సినిమాల్లో నటించారు. స్టార్టింగ్‌లో జమున – అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువ సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత సావిత్రి – ఎన్టీఆర్ కాంబినేషన్ అదిరిపోతుంటే.. జమున – ఏఎన్నార్ దుమ్ము రేపేవారు. ఇక జమున విషయంలో ఎన్టీఆర్ ఎక్కువ చొరవ చూపడంతో పాటు ఆమెకు ఏ సాయం కావాలన్నా చేసి పెట్టేవారట. ఈ చొవరే అప్పట్లో ఇండస్ట్రీలో అనేక అపార్థాలకు దారి తీసిందని అంటారు. ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చే క్రమంలోనే కొన్ని పరిణామాలు జరిగాయి. అప్పటికి ఎన్టీఆర్‌కు రెండో వివాహం జరగలేదు.
అయితే కొందరు అగ్రశ్రేణి నటులు స్టార్టింగ్‌లో హైదరాబాద్‌కు వచ్చేందుకు తటపటాయించారు. జమున తెలుగు వ్యక్తినే పెళ్లి చేసుకోవడంతో ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ ఆమెను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు. అంతే కాకుండా ఆమెకు దగ్గరుండి మరీ జూబ్లిహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయించారు. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆరే స్వయంగా జమున ఇంటి నిర్మాణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అప్పటకి ఎన్టీఆర్‌కు రెండో వివాహం జరగకపోవడంతో పాటు ఎన్టీఆర్ జమున పట్ల ఇంత ఇంట్రస్ట్ చూపిస్తుండడంతో కొన్ని గాసిప్‌లు అయితే బయలుదేరాయట. సినిమా రంగంలోనూ ఇదే విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఇక తన ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఎన్టీఆర్ నిలువెత్తు ఫొటోను జమున తన ఇంట్లో పెట్టుకున్నారు. ఇక నేరుగా తన భర్తను తీసుకు వెళ్లి ఎన్టీఆర్‌ను కలుసుకుని.. ఆ ఫోటోలను ప్రెస్‌కు కూడా రిలీజ్ చేశారు. అలాగే తనపై వస్తోన్న గాసిప్లను ఆమె లైట్ తీస్కొన్నారు. అటు ఎన్టీఆర్‌కు ఇలాంటివి ఎప్పుడూ లైటే.. !