ఉత్తికినే ఎవ్వరూ స్టార్లు అవ్వరు.. అందులోనూ మెగాస్టార్ కావాలంటే ఎంత కష్టం ఉండాలి.. ఎంత డెడికేషన్ ఉండాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల నుంచి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా కొనసాగుతున్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి రు. 100 కోట్ల షేర్ కొట్టాడు. అంతెందుకు సైరా నరసింహారెడ్డి సినిమా అంచనాలు అందుకోలేదు. అయినా కూడా రు. 105 కోట్ల షేర్ కొట్టింది. ఇది చాలు చిరు రేంజ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పుకోవడానికి..!
ఇక వచ్చే నెలలో చిరు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు తనయుడు రామ్‌చరణ్ కూడా 30 నిమిషాల పాటు కనిపించనున్నాడు. ఇక ఆచార్య తర్వాత చిరు మూడు, నాలుగు సినిమాలు ఒకేసారి లైన్లో పెట్టి చకచకా చేసుకుంటూ పోతున్నాడు. ఈ వయస్సులోనూ ఇంత సీనియర్ హీరోగా ఉన్ చిరు చకచకా సినిమాలు చేసుకుంటూ పోవడం.. యూత్ హీరోలకు ఆదర్శప్రాయం అనే చెప్పాలి.
ఓ వైపు మెహర్‌రమేష్ భోళాశంకర్ షూటింగ్ నడుస్తోంది. అటు మోహనరాజా లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ కూడా చాలా వరకు షూటింగ్ అయ్యింది. ఇక చిరు 154 కూడా బాబీ దర్శకత్వంలో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు వాల్తేరు శ్రీను అన్న టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. దీనిపై రేపో మాపో అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ఇటీవలే చిత్రీకరించారట. ఇందులో భాగంగా ఏనుగుపై యాక్షన్ సీన్లు షూట్ చేశాక.. ఏనుగు నుంచి కిందకు దిగే క్రమంలో చిరు జారీ పడ్డారని.. ఈ సందర్భంగా ఆయన కాలు బెణికిందని తెలుస్తోంది.
అయితే ఆయన కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నా కూడా నొప్పి ఓర్చుకుని మరీ షూటింగ్‌లో పాల్గొన్నాడట. తాను వెళ్లిపోతే షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని.. మిగిలిన వాళ్ల కాల్షీట్లు వేస్ట్ అవుతాయనే చిరు ఆ బాధతోనే ఆ సీన్ పూర్తి చేశారట. మరి ఇలాంటి ఉదంతాలే చిరును కెరీర్‌లో తిరుగులేని మెగాస్టార్‌ను చేశాయి. ఇక తన వరుస సినిమాల పరంపరలో బాబి సినిమా తర్వాత సంపత్ నందితో ఒకటి బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు టాక్ ?