ఈ మధ్య కాలంలో చూసి ఇస్తాం అన్నా కూడా ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లు లేరు. ఎందుకంటే ..జనాల్లో పెరిగిపోతున్న దుర్బుద్ధి కారణంగా .. మనం ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయో రావో అని … అప్పు ఇవ్వడమే మానేశారు జనాలు. కానీ కొంత మంది అమాయికులు మాత్రం..మనకు తెలిసిన వారే కదా..మన ఫ్రెండ్ నే కదా అని డబ్బును అప్పుగా ఇస్తున్నారు.. అలా ఇచ్చి మోసపోయి..పోలీస్టేషన్ల చుట్టు తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది.. ఈ అందాల ముద్దుగుమ్మ..రిమి సేన్.
రిమి సేన్ .. అని చెప్పితే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు..కానీ చిరంజీవి అందరివాడు సినిమాలో హీరోయిన్ గా చేసిందే ఆ అమ్మాయి అంటే టక్కున గుర్తు పట్టేస్తారు అందరు. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. అందమతో నటంతో చిరంజీవి పక్కన నటించే అవకాసం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఎందుకోన్ తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తెలుగు లో అవకాశాలు దక్కించుకోలేకపోయినా రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన ‘ధూమ్’ సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పోలిస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. దానికి కారణం ఆమె బాగా నమ్మిన వ్యక్తి చేతిలో మోస పోవడం. యస్.. తన ఫ్రెండ్ అనుకుని భావించి అవసరం అని డబ్బు అడిగితే లేదు కాదు అనుకుండా ఇచ్చిన పాపానికి ఆమెను నిలువునా ముంచేశాడు ఆ దుర్మార్గుడు. రిమి సేన్ కు మూడేళ్ల క్రితం వ్యాపారవేత్త రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి అంధేరిలోని జిమ్ లో పరిచయమయ్యాడు. అలా వీళ్ల మధ్య పరిచయం కాస్త స్ట్రాంగ్ ఫ్రెండ్ షిప్ గా మారి… వ్యాపారం కోసం డబ్బు అప్పుగా తీసుకునే రేంజ్ కి వెళ్లిపోయింది.
కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నామని, రిమిని కూడా భాగస్వామిగా మారితే లాభాలు వస్తాయని నమ్మించాడు రౌనక్ జతిన్. అతని మాయమాటలు నమ్మి రిమి కష్టపడి దాచుకున్న డబ్బు అంతా కలిపి సుమారు రూ. 4.14 కోట్లు ఇచ్చింది. ఇంకెముంది డబ్బు చేతికి అందగానే రిమిని దూరం పెట్టాడు..కొన్ని రోజుల తరువాత నుండి కనిపించదమే మానేశాడు. డౌట్ వచ్చి అస్లౌ విషయం ఆరా తీయ్యగా.. తాను మోసపోయానని అస్సలు అతను ఏ వ్యాపారం ప్రారంభించలేదని తెలిసిషాకైంది రిమి. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం నిందుతుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.