రాజమౌళి ఏ ముహూర్తాన పుష్ప 1 సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేయమని చెప్పాడో కాని ఆ సినిమా రేంజే మారిపోయింది. ఈ విషయాన్ని పుష్ప దర్శకుడు సుకుమార్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఈ ఒక్క ఐడియా బన్నీకి నార్త్‌లో లేని స్టార్‌డమ్‌ను మామూలుగా తీసుకురాలేదు. బన్నీ మార్కెట్‌ను నార్త్‌లో కూడా అమాంతం పెంచేసింది. ఐకాన్ స్టార్ కాస్తా ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బన్నీకి తానే ఊహించని స్టార్ డమ్ వచ్చేసింది. పుష్ప దేశవ్యాప్తంగానే సంచలన విజయం నమోదు చేసింది.
ఇంకా చెప్పాలంటే ఈ సినిమా దక్షిణాదిని మించి ఉత్తరాదిలో రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టడం చాలా గ్రేట్. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 365 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసిన ఈ సినిమా దెబ్బతో అక్కడ స్టార్ హీరోలు సైతం ఇప్పటకీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. తొలి రెండు రోజుల్లో పెద్ద టాక్ లేకుండా పుష్ప ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం బాలీవుడ్‌కు షాకే ఇచ్చింది.
పైగా నార్త్‌లో బన్నీ కాని పుష్ప టీం కాని పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. అయినా రు. 100 కోట్లు వచ్చాయి. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ బన్నీ రెమ్యునరేషన్ రేంజ్‌ను ఇప్పుడు మార్చేసిందట. ఇప్పుడు బన్నీ రేటు మామూలుగా లేదనే అంటున్నారు. ఈ లెక్కలే ఇప్పుడు పుష్ప 2 సినిమా పట్టాలు ఎక్కేందుకు ఆలస్యం అవుతున్నాయని టాక్ ? పుష్ప 1కే బన్నీకి కాస్త అటూ ఇటూగా రు. 45 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట.
అయితే ఇప్పుడు పుష్ప 2కు బన్నీ రెమ్యునరేషన్‌కు బదులుగా హిందీ రైట్స్ డిమాండ్ చేస్తున్నాడట. నిర్మాతలు కూడా పుష్ప హిందీలో రు. 100 కోట్లు వసూలు చేస్తుందని అనుకోలేదు. అది వాళ్లకు అదనపు ఆదాయం అయ్యింది. అందుకే ఇప్పుడు తెలుగు, ఇతర మార్కెట్ అంతా తాము చూసుకుని.. బన్నీకి హిందీ రైట్స్ వదిలేయాలనే దాదాపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే హిందీ వెర్షన్ బాధ్యతలు అంతా అల్లు అరవింద్‌కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎలా లేదన్నా హిందీ వెర్షన్ అంటే కనీసం రు. 60 – 70 కోట్లను మించిన రేంజ్‌లో అక్కడ ప్రి రిలీజ్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు. అరవింద్ తన మార్కెట్ స్ట్రాటజీ ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా కూడా బన్నీ ఖాతాలోకే వెళుతుంది. ఇక సుకుమార్ కూడా పుష్ప ఏ స్థాయి హిట్ అయ్యిందో ఆ రేంజ్‌లోనే పుష్ప 2 కూడా ఉండేలా కసితో ఉన్నాడు. ఏదేమైనా బన్నీ రేంజ్ అయితే మామూలుగా లేదనే చెప్పాలి.