“రాధేశ్యామ్”.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ పేరే వినిపిస్తుంది. అంతాలా జనాభా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నటించిన ఏకైక సినిమా సాహో..అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత తెర పై ప్రభాస్ కనిపించనేలేదు. దీంతో మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు.
ఎలాగైనా ప్రభాస్ ఈ సినిమా తో బాహుబలి రికార్డులు తిరగరాయలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు తలచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఉదాహరణలు ఇది వరకు వచ్చిన సినిమాలే. అయితే అభిమానులు మాత్రం ఈ సినిమాను టాప్ ప్లేస్ లో నిలబెట్టాలి అని చూస్తుంటే..చిత్ర బృందం మాత్రం..ఈ సినిమాలో ని ఇంట్రెస్టింగ్ సీన్లను కట్ చేసి పడేస్తున్నారు.
అసలే ఈ సినిమా రన్ టైం చాలా తక్కువుగా ఉంది అని అనుకుంటుంటే దాంట్లో మళ్లీ ఇలా సీన్స్ ని ట్రిమ్ చేసుకుంటూపోతే ఎలా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ప్రభాస్ కు నచ్చి మెచ్చి చేసిన ఓ సీన్ ను మేకర్స్ కట్ చేసేశారట. అది కూడా ప్రభాస్ కు చెప్పకుండానే చేయడంతో ప్రభాస్ బాగా డిస్సపాయింట్ అయ్యిన్నత్లు తెలుస్తుంది.
కొవిడ్ కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు.. యూరోపియన్ సెటప్‌ని హైదరాబాద్‌లోనే మేకర్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికోసం కోట్లకి కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సీన్ కోసం అక్కడ ఓ పర్ఫ్యూమ్ స్టోర్ సెట్‌ని సైతం నిర్మించారట. అందులో వివిధ పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీల నుంచి సుమార్ 2000 పర్ఫ్యూమ్ బాటిల్స్‌ని తీసుకొచ్చి పెట్టి మరీ ..ఆ సీన్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారట డైరెక్టర్. ఆ సెట్‌ని ఎంతో అందంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ చిత్రీకరించిన ఓ సన్నివేశం కూడా ప్రభాస్‌కి ఎంతో బాగా నచ్చిందట. కానీ, ఫైనల్ మూమెంట్ లో ఆ సీన్ తొలగించడం..అది కూడా ప్రభాస్ పర్మీషన్ లేకుండా చేయడంతో ప్రభాస్ హర్ట్ అయ్యాడట. దీంతో అభిమానులు కూడా మేకర్స్ పై మండిపడుతున్నారు.