పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించడం.. దీనికి తోడు నిత్యామీనన్ లాంటి టాలెంట్ నటి, సంయుక్త మీనన్ కూడా నటించడం.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న అంచనాలే ఉన్నాయి.
ఈ అంచనాలు నిజం చేస్తూ భీమ్లానాయక్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న భీమ్లా ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా ఇలా వసూళ్లు రాబట్టింది.
నైజాం – 33.22 కోట్లు
సీడెడ్ – 10.09 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.91 కోట్లు
ఈస్ట్ – 5.02 కోట్లు
వెస్ట్ – 4.63 కోట్లు
గుంటూరు – 4.82 కోట్లు
కృష్ణా – 3.38 కోట్లు
నెల్లూరు – 2.33 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ షేర్ = 70.40 కోట్లు
ఏపీ+తెలంగాణ గ్రాస్ = 106.90 కోట్లు
——————————————–
ఇక కర్నాకటతో పాటు రెస్టాఫ్ ఇండియా రూ. 7.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.55 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 146 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వారం రోజులకే రు. 146 కోట్ల గ్రాస్ అంటే పవన్ రు. 150 కోట్ల మార్క్‌కు చేరువైపోయాడు. ఇక సెకండ్ వీక్‌లో ఈ సినిమా స్టడీగా పెర్పామెన్స్ చేసినా మంచి వసూళ్లే రాబట్టవచ్చు. ఈ వారం స్టెబాస్టియన్, ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా మినహా పెద్ద సినిమాలు భీమ్లాకు పోటీగా లేవు. బీ, సీ సెంటర్లలోనూ ఈ సినిమాదే రాజ్యం. ఇక ఈ నెల 11న రాధేశ్యామ్ సినిమా వచ్చేవరకు ఈ సినిమాను అడ్డుకునే వాళ్లే లేరు. దీంతో పవన్ కెరీర్‌లోనే గ్రాస్, షేర్ పరంగా భీమ్లానాయక్ టాప్ వసూళ్లు సాధించే ఛాన్సులు ఉన్నాయి.