మళయాళ స్టార్ హీరోయిన్ భావన.. ఐదేళ్ల క్రితం లైంగీక దాడి జరగడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. భావన తెలుగులోనూ సినిమాలు చేసింది. గోపీచంద్ ఒంటరి, శ్రీకాంత్ మహాత్మ సినిమాలు చేసింది. మళయాళ హీరో దిలీప్‌కు భావనకు మధ్య ఏవేవో గొడవలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఓ రోజు సడెన్‌గా ఆమెను కిడ్నాప్ చేసి లైంగీకంగా దాడి చేశారు. ఈ దాడి వెనక ప్రధాన సూత్రధారి దిలీప్ అని ఆరోపణలు రావడంతో పాటు అతడు ఈ కేసు విషయంలోనే కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు కూడా వచ్చారు.
వ్యక్తిగత విషయంలో గొడవలు మనసులో పెట్టుకునే దిలీప్ ఆమెను కిడ్నాప్ చేయించాడన్న ప్రచారమే అప్పుడు జరిగింది. అయితే ఈ దాడి తర్వాత ఇప్పటి వరకు భావన ఎక్కడా నోరు మెదపలేదు. మీడియా కూడా ఈ కేసు విషయంలో భావన పట్ల సానుభూతి చూపిస్తూ ఆమె పేరు కూడా రాసేందుకు ఇష్టపడలేదు.
అయితే తాను తప్పు చేయనప్పుడు తాను ఎవ్వరికి భయపడాల్సిన పనిలేదన్న ఉద్దేశంతో భావన ఈ విషయమై ఇటీవలే ఓపెన్ అయ్యింది. ఇక ఈ కేసు విషయమై ఆమె కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఏకంగా బహిరంగ లేఖ రాసి సంచలనం క్రియేట్ చేసింది.
తాజాగా ఈ కేసు విషయమై నేషనల్ మీడియాతో మాట్లాడిన భావన లైంగీక దాడి జరిగినప్పుడు తాను చాలా మానసిక క్షోభ అనుభవించానని ఓ నేషనల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అసలే దాడి జరిగి తాను మనోవేదనతో ఉంటే తర్వాత పరిణామాలు తనకు మరింత వేదన మిగిల్చాయని చెప్పింది. అయితే ఈ టైంలో తన కోసం బాధితులు చాలా మంది నిలబడ్డారని.. కొందరు తన మీదే నిందలు వేసి.. సూటిపోటి మాటలతో వేధించారని వాపోయింది.
ఈ సూటిపోటి మాటలే తనను, తన కుటుంబాన్ని చాలా బాధ పెట్టాయని భావన వాపోయింది. ఇక 2019 వరకు తాను సోషల్ మీడియాలో లేనని.. ఆ టైంలోనే తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడంతో చాలా మంది తనపై దాడికి దిగారని చెప్పింది. కొందరు అయితే నువ్వు ఇంకా ఎందుకు బతికి ఉన్నావు.. చచ్చిపోవచ్చు కదా ? అని చాలా దారుణంగా కామెంట్ చేశారని వాపోయింది. అప్పుడే తాను సీఎంకు లేఖ రాశానని.. ఆ టైంలో తనకు చాలా మంది మద్దతు లభించిందని భావన చెప్పింది.