పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం రాధేశ్యామ్. సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. పామిస్ట్రీతో పాటు 1960లో యూరప్‌లోని ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా 104 సెట్లు వేశారు. పామిస్ట్రీకి ప్రేమకథను యాడ్ చేసి మరీ ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. మూడు సంవత్సరాల పాటు షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా మొన్న సంక్రాంతికి రావాల్సి ఉన్నా వాయిదా పడి ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి వస్తోంది.
కరోనా పూర్తిగా తగ్గిపోయినట్టే ఉంది. ఏపీలోనూ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. పైగా ఐదు షోలు వేసుకోవచ్చు.. సోలో రిలీజ్ కావడం కూడా కలిసి రానుంది. ఇన్నీ సానుకూల అంశాలు ఉన్నా కూడా ఏపీలో రిలీజ్‌కు ముందు రోజు పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. ఇందుకు ఓ ప్రధాన కారణం కూడా ఉంది. ఎంత టిక్కెట్ రేట్లు పెరిగినా కూడా ఏపీకి చెందిన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ కాలేదు. ఏ బుకింగ్ యాప్‌లోనూ ఏపీ థియేటర్ల బుకింగ్‌లు లేవు.
మరి కొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ వేళ బుక్ మై షో సైట్‌తో సహా ఏ యాప్‌లో అయినా టిక్కెట్‌బుక్ చేసుకోవాలంటే కుదరట్లేదు. అసలు సైట్లు, యాప్‌లలో రాధేశ్యామ్ కనపడకపోవడంతో ఇప్పుడు విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టిక్కెట్ రేట్ల హైక్‌కు సంబంధించి జీవో కూడా రిలీజ్ చేసింది. ఈ జీవో వచ్చాక కూడా ఏపీలో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఈ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదు. అసలు ఇది టెక్నికల్ లోపమా ? లేదా ? ప్రభుత్వమే త్వరలో ఆన్‌లైన్ టిక్కెట్టింగ్ విధానం తీసుకు వస్తామని చెప్పడంతో అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందా ? అన్నది క్లారిటీ లేదు.
ఇంత పెద్ద సినిమాకు ఆన్‌లైన్ బుకింగ్‌లు లేకపోతే పెద్ద మైనస్ అవుతుంది. అది వసూళ్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందులోనూ రాధేశ్యామ్ ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్‌కు రావాలంటేనే ఏకంగా రు. 105 కోట్ల షేర్ రాబట్టాలి.. అంటే రు. 150 కు పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాలి. ఏదేమైనా అసలు ఏపీలో టిక్కెట్ల విషయం ముందు నుంచి పెద్ద గందరగోళంలోనే ఉంది. ప్రభుత్వంలో ఇండస్ట్రీ పెద్దలు ఇన్ని సార్లు చర్చలు జరిపి జీవో వచ్చికూడా ఆన్‌లైన్ బుకింగ్ లేకపోవడం ఏంటో అర్థం కావడంలేదు.